Friday, June 26, 2026 01:21 PM
Friday, June 26, 2026 01:21 PM

సూర్యవంశీ.. టీమిండియా టూర్‌ లో ఊహించని ట్విస్ట్..!

భారత క్రికెట్‌ లో సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ స్థాయి సంచలనంగా మారిన 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. ఐర్లాండ్‌ తో జరిగే మ్యాచ్‌ లో బరిలోకి దిగడం ద్వారా భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ లో అరంగేట్రం చేయనున్న అత్యంత పిన్న వయస్కుడిగా సచిన్ పేరిట ఉన్న రికార్డును వైభవ్ బ్రేక్ చేయనున్నాడు. అయితే, ఈ వేసవిలో జరగనున్న ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైన ఈ వండర్ కిడ్‌ కు మైదానం వెలుపల ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక వింత పరిస్థితి ఎదురుకానుంది.

Also Read : గ్రీన్ కార్డ్ హోల్డర్లకు యూఎస్ సుప్రీంకోర్టు షాక్..!

ఐసీసీ మరియు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు చైల్డ్ ప్రొటెక్షన్ నిబంధనల ప్రకారం 16 ఏళ్ల లోపు ఉన్న ఆటగాళ్లు సీనియర్ ఆటగాళ్లతో కలిసి ఒకే డ్రెస్సింగ్ రూమ్‌ లో బట్టలు మార్చుకోవడానికి వీల్లేదు. అందువల్ల ఈ పర్యటనలో వైభవ్ సూర్యవంశీ కోసం మ్యాచ్‌ కు ముందు, తర్వాత బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేకంగా విడిగా గదులను ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ నియమం కేవలం దుస్తులు మార్చుకునేందుకు మాత్రమే వర్తిస్తుంది. మ్యాచ్ సమయంలో వ్యూహాలు రచించడానికి, టీమ్ మీటింగ్స్‌ లో పాల్గొనడానికి డ్రెస్సింగ్ రూమ్‌ లోకి వైభవ్‌ కు పూర్తి అనుమతి ఉంటుంది.

Also Read : నదుల అనుసంధానంతో భారత్ ‘అన్‌స్టాపబుల్’..!

సాధారణ ప్రోటోకాల్‌ ను పక్కనపెట్టి వైభవ్ వయస్సును పరిగణనలోకి తీసుకున్న బోర్డు, ఈ పర్యటనలో అతని తల్లిదండ్రులు కూడా అతనితో పాటే ప్రయాణించడానికి, ఒకే హోటల్‌ లో స్టే చేయడానికి ప్రత్యేక అనుమతి ఇచ్చింది. గత రెండు సీజన్లుగా ఐపీఎల్‌ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్‌ కు అక్కడ ఇలాంటి ఆంక్షలేవీ ఎదురుకాలేదు. కానీ ఐసీసీ పరిధిలోకి వచ్చే అంతర్జాతీయ సిరీస్ కావడంతో ఈ భద్రతా నిబంధనలను ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఖచ్చితంగా అమలు చేయనున్నాయి. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్‌ లో 776 పరుగులు చేసి లీడింగ్‌ రన్‌ స్కోరర్‌ గా నిలిచిన వైభవ్, ఒకే సీజన్‌ లో 65 సిక్సర్లు బాది క్రిస్ గేల్ రికార్డును సైతం తిరగరాశాడు. అలాగే ఇండియా-ఏ తరఫున శ్రీలంక-ఏ పై కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి లిస్ట్-ఏ క్రికెట్‌ లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఆ ఇద్దరు హెడ్...

విజయవాడలో పెను సంచలనం సృష్టించిన గాదె...

సంచలన నిర్ణయం దిశగా...

ఏపీ విద్యాశాఖలో విప్లవాత్మక మార్పుల దిశగా...

సింగిల్‌గా పోరాడుతున్న జనసేనాని..!

"నేనొక్కడినే మాట్లాడాలా..? మీ గొంతులు ఎందుకు...

నదుల అనుసంధానంతో భారత్...

కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్...

పాస్‌పోర్ట్ జాతీయత కాదా..?...

భారతీయ పాస్‌పోర్ట్ అనేది కేవలం ఒక...

తిరుపతిలో భూమన భారీ...

వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ...

పోల్స్