Monday, September 28, 2026 07:37 AM
Monday, September 28, 2026 07:37 AM

నేను హిందువునే.. జేడి వాన్స్ భార్య సంచలనం..!

అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ భార్య, యూఎస్ సెకండ్ లేడీ ఉషా వాన్స్ తన మతం మార్పుపై అంతర్జాతీయ మీడియాలో వస్తున్న ఊహాగానాలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. తన భర్త జేడీ వాన్స్ క్రిస్టియానిటీ లోకి మారినప్పటికీ, తాను మాత్రం ఇప్పటికీ తన హిందూ మతాన్నే నమ్ముతున్నానని స్పష్టం చేశారు. జేడీ వాన్స్ ఇటీవల ప్రచురించిన కమ్యూనియన్: ఫైండింగ్ మై వే బ్యాక్ టు ఫెయిత్ అనే పుస్తకంలో తన ఆధ్యాత్మిక ప్రయాణం గురించి రాయడం, తన భార్య కూడా ఏదో ఒకరోజు క్రైస్తవ మతంలోకి మారుతుందని ఆశించడంపై పెద్ద చర్చ నడిచింది.

Also Read : లోకేష్ సంచలన ప్రకటన.. దేశంలోనే తొలి రాష్ట్రం..!

దీనిపై ఉషా వాన్స్ స్పందిస్తూ, తన భర్త తనపై మతమార్పిడి కోసం ప్రతిరోజూ ఎలాంటి ఒత్తిడి చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. తన భర్త జేడీ వాన్స్ చిన్నతనం మొత్తం ఎంతో గందరగోళంగా, తీవ్రమైన మానసిక ఒత్తిడి మరియు కుటుంబంలో అస్థిరత్వంతో సాగిందని, అందుకే ఆయన జీవితంలో ప్రశాంతత కోసం చర్చిని ఆశ్రయించారని ఉషా వాన్స్ గుర్తుచేశారు. ఆయనకు థెరపీ పని చేయలేదు కానీ, చర్చి బాగా పనిచేసింది అంటూ వ్యాఖ్యానించారు. కానీ తాను మాత్రం కాలిఫోర్నియాలో భారతీయ వలస తల్లిదండ్రుల వద్ద ఎంతో సంతోషకరమైన, ప్రశాంతమైన హిందూ కుటుంబంలో పెరిగానని తెలిపారు.

Also Read : యూకే వీసాలపై భారత్ కు గుడ్ న్యూస్..?

తన జీవితంలో మొదటి నుండి మానసిక స్థిరత్వం ఉందని, అందుకే తాను మతం మార్చుకుని వేరే వ్యక్తిలా నటించాల్సిన అవసరం రాలేదని ఆమె పక్కా క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే, ఫాదర్స్ డే సందర్భంగా స్టోరీ టైమ్ విత్ ది సెకండ్ లేడీ అనే ఒక పాడ్‌ కాస్ట్ ఎపిసోడ్‌ లో జేడీ వాన్స్ తన భార్య ఉషా వాన్స్ మోకాలిపై వింతగా తట్టిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ట్రోల్స్‌ కు దారితీసింది. ఈ వివాదాల మధ్యనే వాన్స్ కుటుంబంలోకి త్వరలోనే నాలుగో బిడ్డ రాబోతున్నట్లు, ఉషా వాన్స్ ప్రస్తుతం గర్భవతి అని ఈ ఇంటర్వ్యూ ద్వారా వారు అధికారికంగా ప్రకటించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

త్రిముఖ పోటీ ఖాయమేనా..?

ఖైరతాబాద్ గణేష్ గంగమ్మ ఒడికి చేరాడు....

జగన్ మునిగితే తాను...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ సీఎం వైఎస్...

సరస్ మేళా :...

మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు...

డ్రామాలు వద్దు.. వైఎస్...

గత కొన్ని రోజులుగా ఎలక్షన్ కమిషన్...

జనసేన గూటికి కీలక...

ఆంధ్రప్రదేశ్ రాజకీయం స్థానిక సంస్థల ఎన్నికల...

రెండు రోజులు.. 21...

ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా దేశంలోనే నెంబర్ వన్...

పోల్స్