Monday, September 28, 2026 08:28 AM
Monday, September 28, 2026 08:28 AM

యూకే వీసాలపై భారత్ కు గుడ్ న్యూస్..?

బ్రిటన్ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేయడంతో అంతర్జాతీయంగా కొత్త చర్చకు తెరలేచింది. స్టార్మర్ ఆకస్మిక నిష్క్రమణతో భారత్ మరియు బ్రిటన్ మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాల భవిష్యత్తు ఇప్పుడు సరికొత్త సవాళ్లు ఎదుర్కొనే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఇరు దేశాల మధ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా సాగుతున్న వాణిజ్య ఒప్పందాలు, వీసా నిబంధనలపై ఈ మార్పు ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై ఇరు దేశాల దౌత్య వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Also Read : సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు..!

కీర్ స్టార్మర్ హయాంలో భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి అత్యంత ప్రాధాన్యత లభించింది. ఆయన సారథ్యంలోనే ఇరు దేశాల చర్చలు వేగవంతమై తుది దశకు చేరుకున్నాయి. ఈ చారిత్రాత్మక ఒప్పందం రాబోయే జూలై 15, 2026 నుండి అధికారికంగా అమల్లోకి రానుంది. ఈ ఎఫ్‌టీఏ ద్వారా బ్రిటన్ జీడీపీ భారీగా పెరగడమే కాకుండా, ఇరు దేశాల మధ్య ఏటా బిలియన్ల కొద్దీ వ్యాపారం సాగనుంది. ముఖ్యంగా బ్రిటన్ నుంచి వచ్చే విస్కీ, ఆటోమొబైల్స్, కాస్మెటిక్స్ వంటి ఉత్పత్తులపై భారత్‌లో టారిఫ్‌లు భారీగా తగ్గనున్నాయి.

Also Read : ఉక్రెయిన్‌ కు భారత సైన్యం..? వైట్ హౌస్ సీక్రెట్స్ లీక్..!

భారత్‌ ను నమ్మకమైన భాగస్వామిగా చూసినప్పటికీ, వీసా నిబంధనల విషయంలో మాత్రం కీర్ స్టార్మర్ అత్యంత కఠినంగా వ్యవహరించారు. బ్రిటన్‌ లో ఉన్న వలస వ్యతిరేక నిరసనల దృష్ట్యా, భారతీయులకు వీసా సడలింపులు ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. వాణిజ్య ఒప్పందాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వలసల అంశంతో ముడిపెట్టకూడదని స్పష్టం చేస్తూ, ప్రత్యేక వీసా డీల్ కోసం భారత్ చేసిన అభ్యర్థనలను ఆయన తోసిపుచ్చారు. అయితే డిఫెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ రంగాల్లో ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

త్రిముఖ పోటీ ఖాయమేనా..?

ఖైరతాబాద్ గణేష్ గంగమ్మ ఒడికి చేరాడు....

జగన్ మునిగితే తాను...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ సీఎం వైఎస్...

సరస్ మేళా :...

మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు...

డ్రామాలు వద్దు.. వైఎస్...

గత కొన్ని రోజులుగా ఎలక్షన్ కమిషన్...

జనసేన గూటికి కీలక...

ఆంధ్రప్రదేశ్ రాజకీయం స్థానిక సంస్థల ఎన్నికల...

రెండు రోజులు.. 21...

ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా దేశంలోనే నెంబర్ వన్...

పోల్స్