Sunday, August 9, 2026 10:13 AM
Sunday, August 9, 2026 10:13 AM

సొంత గూటికి రిషభ్ పంత్.. ఎంత లాస్ అంటే..!

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత సంచలనాత్మక ట్రేడింగ్ డీల్ అధికారికంగా ఖరారైంది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తన పాత హోమ్ ఫ్రాంచైజీ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ లోకి మళ్లీ అడుగుపెట్టగా, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో సూపర్ జాయింట్స్ జట్టులోకి మారాడు. ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఈ భారీ స్వాప్ డీల్‌ ను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మంగళవారం అధికారికంగా ధ్రువీకరించింది. ఈ ట్రేడింగ్‌ లో రిషభ్ పంత్ తీసుకున్న ఒక నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Also Read : టైం ఇచ్చి చూడండి.. విజయ్ సంచలన వ్యాఖ్యలు..!

లక్నో సూపర్ జాయింట్స్ జట్టులో ఏడాదికి ఏకంగా 27 కోట్ల రూపాయల రికార్డు ధర తీసుకున్న పంత్.. తన పాత జట్టు అయిన ఢిల్లీకి తిరిగి రావడం కోసం భారీగా జీతాన్ని తగ్గించుకోవడానికి సిద్ధపడ్డాడు. కొత్త ఒప్పందం ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో పంత్ ఒక సీజన్‌ కు 15 కోట్ల రూపాయల వేతనాన్ని అందుకోనున్నాడు. లక్నో జట్టులో గత రెండు సీజన్లలో కెప్టెన్‌ గా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన పంత్, మళ్లీ తన సొంత గూటికి చేరడానికే మొగ్గు చూపాడు.

Also Read : హైస్పీడ్‌గా రైలు నెట్‌వర్క్..!

మరోవైపు, ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున గత ఐదు సీజన్లలో 65 మ్యాచ్‌లాడి 72 వికెట్లతో అద్భుతమైన రికార్డు సృష్టించిన కుల్దీప్ యాదవ్ ఇకపై లక్నో జెర్సీలో కనిపించనున్నాడు. కుల్దీప్ యాదవ్ తన పాత వాల్యుయేషన్ అయిన 13.50 కోట్ల రూపాయల కాంట్రాక్ట్‌ తోనే లక్నో సూపర్ జాయింట్స్ జట్టులో చేరారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఈ ప్లేయర్ల మార్పిడి డీల్.. రాబోయే సీజన్లలో ఈ రెండు జట్ల బలాబలాలను ఎంతవరకు మారుస్తుందో చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మంత్రులకి లోకేష్‌ బిగ్‌...

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా...

ఏపీలో త్వరలోనే క్యాబినెట్‌...

ఏపీ రాజకీయాల్లో మరోసారి కేబినేట్ ప్రక్షాళన...

పార్టీ ఆఫీస్ లో...

స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలు...

పోలీసులను టార్గెట్ చేసిన...

గత కొన్ని రోజులుగా సంచలనంగా మారిన...

జనసేన జెండా కోసం...

డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాజకీయంగా...

కవితను లైట్ తీసుకున్న...

తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్, బావ...

పోల్స్