Thursday, August 6, 2026 07:40 PM
Thursday, August 6, 2026 07:40 PM

భారత్ కు పాక్ వార్నింగ్.. అదే జరిగితే యుద్దమే..!

భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య సింధూ జలాల ఒప్పందం చుట్టూ వివాదం తీవ్రస్థాయికి చేరింది. సింధూ నదీ వ్యవస్థపై భారత్ తీసుకునే చర్యలు తమ దేశ నీటి భద్రతకు ముప్పుగా పరిణమిస్తే సైనిక చర్యకు వెనకాడబోమని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరించారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, నీరు అనేది తమ జాతీయ భద్రతలో భాగమని, భారత్ గనుక ప్రవాహాలను నిలిపివేస్తే తాము ఖచ్చితంగా యుద్ధానికి వెళ్తామని స్పష్టం చేశారు.

Also Read  :సాయి కృష్ణ కేసులో నేడు సంచలనాలు..!

ఈ వివాదం ఇంతలా ముదరడానికి జూన్ 2028 నాటికి పాకిస్తాన్‌కు వెళ్లే సింధూ నది నీటిని పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉందంటూ భారత జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ మాట్లాడిన ఒక వీడియో క్లిప్ బయటకు రావడమే కారణం. ఏప్రిల్ 2025లో జమ్మూ కాశ్మీర్‌ లోని పహల్గామ్‌ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన తర్వాత, భారత్ ఈ 1960 నాటి ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. సరిహద్దు ఉగ్రవాదంపై ఇస్లామాబాద్ కఠినమైన చర్యలు తీసుకునేంత వరకు ఈ ఒప్పందం పునరుద్ధరించబడదని కేంద్ర సర్కార్ స్పష్టం చేసింది.

Also Read  :సాయి విషయంలో డ్యూయల్ రూల్.. కాపుల్లో ఆవేదన!

ప్రస్తుతం తీవ్రమైన నీటి ఎద్దడితో సతమతమవుతున్న పాకిస్తాన్‌ కు ఈ నదీ జలాలే జీవనాధారం. ఈ ఒప్పందం ప్రకారం దాదాపు 80 శాతం నీరు పాక్‌ కే దక్కుతుంది, ఇది ఆ దేశ వ్యవసాయానికి ఎంతో కీలకం. ఇటీవల చెనాబ్ నది నీటిని మళ్లించేందుకు భారత్ నదీ అనుసంధాన ప్రాజెక్టును చేపడుతోందని ఆరోపించిన పాక్ డిప్యూటీ సీఎం ఇషాక్ దార్, ఈ వ్యవహారంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి జోక్యం చేసుకోవాలని కూడా కోరారు. రెండు అణ్వాయుధ దేశాల మధ్య ఈ నీటి వివాదం ఇప్పుడు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పక్కన పెడతారా.. ఉద్యమిస్తారా..?...

రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత ఆసక్తికర...

పొగాకు రైతులపై జగన్‌...

దేవరాపల్లిలో వైసీపీ చీఫ్ జగన్‌మోహన్‌రెడ్డి పొగాకు...

వైసీపీ ఫేక్ ప్రచారానికి...

ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకం...

ప్రభుత్వాన్ని నడిపిస్తోంది ఎవరూ..?

ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేయడం...

వెంటాడుతున్న ED.. వేల...

వైసీపీ నేతలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ -...

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ...

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చుక్కలు చూపిస్తోంది....

పోల్స్