Sunday, September 20, 2026 06:40 AM
Sunday, September 20, 2026 06:40 AM

SBI వర్సెస్ తెలంగాణా సర్కార్.. సంచలన నిర్ణయం..!

రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవహరించిన తీరుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సదరు బ్యాంకుతో ఉన్న అన్ని రకాల ఆర్థిక సంబంధాలను తక్షణమే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ లో ఉన్న ప్రభుత్వ డిపాజిట్లు, ఖాతాలను ఇతర బ్యాంకులకు మార్చేసే అంశంపై ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. రూ.600 కోట్ల భారీ విలువైన ప్రభుత్వ భూమిని కేవలం రూ.13.5 కోట్లకే కేటాయించేందుకు బ్యాంక్ మొదట అంగీకరించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Also Read : బిజేపిలో ఏం జరుగుతోంది..? రాజనాథ్ ఇంట్లో కీలక భేటీ..!

అయితే, కేటాయింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత బ్యాంకు తన వైఖరిని పూర్తిగా మార్చుకుందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ వివాదానికి సంబంధించి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ, స్టేట్ బ్యాంక్ కోర్టును ఆశ్రయించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. స్టేట్ బ్యాంక్ తీరుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఆర్థిక శాఖతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా అధికారికంగా ఫిర్యాదు చేసింది.

Also Read : సాయికృష్ణ వ్యవహారంలో వైసీపీకి ఒరిగిందేమిటి?

బ్యాంకు తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం వెనుక ఏవైనా రాజకీయ ఒత్తిళ్లు లేదా కుట్ర కోణాలు ఉన్నాయా అనే కోణంలో ప్రభుత్వం ప్రస్తుతం ఆరా తీస్తోంది. ప్రభుత్వ బ్యాంకింగ్ లావాదేవీల నిలిపివేత నిర్ణయంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల నిధులు, సంక్షేమ పథకాల డిపాజిట్లు ఇతర జాతీయ, ప్రైవేట్ బ్యాంకులకు మళ్లిస్తే.. అది బ్యాంకు విశ్వసనీయతపై కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, బ్యాంకు ఉన్నతాధికారుల తీరుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్