Thursday, June 18, 2026 11:40 PM
Thursday, June 18, 2026 11:40 PM

దేవర 2.. షాక్‌లో తారక్ ఫ్యాన్స్..!

ప్రస్తుతం ఫ్రాంచైజీలు.. సీక్వెల్స్ హవా నడుస్తోంది. భారీ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే దానికి కొనసాగింపుగా పార్ట్ 2 రావడం సర్వసాధారణంగా మారిపోయింది. ఈ క్రమంలోనే తారక్ – కొరటాల శివ కాంబినేషన్‌లో దేవర 2 కూడా గ్రాండ్‌గా లాంచ్ అవుతుందని అంతా భావిస్తున్నారు. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే దేవర 2 ఉంటుందా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జూన్ 15న దర్శకుడు కొరటాల శివ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు దేవర 2 పై క్రేజీ అప్‌డేట్ వస్తుందని ఆశగా ఎదురు చూశారు. కానీ ఈసారి మేకర్స్ నుంచి ఎలాంటి చప్పుడు లేదు. జూనియర్ ఎన్టీఆర్ కూడా కొరటాలకు శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ట్వీట్‌లో కేవలం ఆయన భవిష్యత్ ప్రాజెక్టులకు మాత్రమే ఆల్ ది బెస్ట్ చెప్పారు. అంతే తప్ప ఎక్కడా తమ కాంబినేషన్‌లో రాబోయే సీక్వెల్ ప్రస్తావన తీసుకురాకపోవడం నందమూరి అభిమానులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.

Also Read : క్రికెట్ అభిమానుల సరికొత్త క్రష్… ఇరా ఏరీ

ఈ నిశ్శబ్దానికి ప్రధాన కారణం యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ డైరీ ఫుల్ కావడమేనని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా డ్రాగన్ షూటింగ్‌తో తారక్ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం దాదాపు ఏడాది కాలం పాటు కాల్షీట్‌లను కేటాయించారు. దీని తర్వాత కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ .. ఇతర అగ్ర దర్శకులతో సినిమాలు లైన్‌లో ఉండటంతో ఇప్పట్లో దేవర 2 కోసం సమయం కేటాయించడం ఎన్‌టీఆర్‌కు సాధ్యపడేలా కనిపించడం లేదు. స్క్రిప్ట్ పరంగా కూడా తారక్ చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తుండటంతో ప్రాజెక్ట్ మరింత ఆలస్యమయ్యేలా ఉంది.

Also Read : ఆర్టీసీ ప్రైవేటీకరణ.. సర్కార్ క్లారిటీ..!

దర్శకుడు కొరటాల శివ కూడా ఎన్టీఆర్ కోసం వేచి చూడకుండా తదుపరి అడుగు వేశారు. నటసింహం నందమూరి బాలకృష్ణతో శివ భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఇప్పటికే లాక్ చేసుకున్నారు. దీంతో కొరటాల శివ పూర్తి దృష్టి బాలయ్య సినిమాపైనే ఉందని స్పష్టమైంది. ఈ సినిమా పూర్తి కావడానికి కనీసం ఏడాదికి పైగా సమయం పడుతుంది. కాబట్టి దేవర కథ ప్రస్తుతానికి అసంపూర్తిగానే నిలిచిపోక తప్పని పరిస్థితి ఏర్పడింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా...

ప్రజల్లోకి వెళ్ళాల్సిందే.. చంద్రబాబు...

ఏపీలో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్న...

బ్రేకింగ్: లోకేష్ సంచలన...

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుర్చీలో...

భయపడాల్సిన వారేమో భయపెడుతున్నారు.. భయపెట్టాల్సిన వారేమో...

పోల్స్