Tuesday, June 16, 2026 11:52 PM
Tuesday, June 16, 2026 11:52 PM

ఈరోజు రాశి ఫలితాలు (16-06-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, బహుళ పక్షం.. 16-06-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాల విస్తరణకు నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

—————————————

వృషభం

ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఇంటా బయటా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. దైవ చింతన కలుగుతుంది. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి.

—————————————

మిధునం

గృహమున కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారమున లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగ సమస్యలు తొలగుతాయి. ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది.

—————————————

కర్కాటకం

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది. కీలక సమయంలో కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది. బంధువులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా రాణిస్తారు.

—————————————

సింహం

ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించనప్పటికి అవసరానికి ధనం అందుతుంది. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగమున చికాకులు పెరుగుతాయి.

—————————————

కన్య

భూ సంబంధిత వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. వ్యాపారమున పెట్టుబడుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. విద్యార్థుల పరీక్ష ఫలితాలు నిరాశ కలిగిస్తాయి.

—————————————

తుల

చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఊహించని రీతిలో నిరుద్యోగులకు అవకాశములు అందుతాయి. ఉద్యోగాలలో అనుకున్నది సాధిస్తారు. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి.

—————————————

వృశ్చికం

నూతన భూ గృహ యోగమున్నది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార,ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. మొండిబాకీలు వసూలవుతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. చాలాకాలంగా వేదిస్తున్న సమస్యలు పరిష్కారమౌతాయి.

—————————————

ధనస్సు

ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఋణదాతల ఒత్తిడితో నూతన ఋణాలు చెయ్యవలసి వస్తుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన శిరోబాధను కలిగిస్తుంది.

—————————————

మకరం

కుటుంబ సభ్యులతో అకారణంగా తగాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అనుకున్న వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఉద్యోగాలలో రావలసిన అవకాశాలు చేజారుతాయి.

—————————————

కుంభం

వృత్తి ఉద్యోగాలలో మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. విలువైన వస్తు లాభాలు పొందుతారు. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు అదిగమిస్తారు.

—————————————

మీనం

చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు. కుటుంబ సభ్యుల నుంచి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. వ్యాపారాలు మందగిస్తాయి. బంధువులతో మాటపట్టింపులుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగమున కొన్ని వ్యవవహారాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

—————————————

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహనా కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కేశినేని బ్రదర్స్ వార్.....

కేశినేని బ్రదర్స్ మధ్య ఆర్థిక ఆరోపణల...

ఆర్టీసీ ప్రైవేటీకరణ.. సర్కార్...

ఏపీఎస్ ఆర్టీసీలో విద్యుత్ బస్సుల కొనుగోలు,...

గోదావరి – బనకచర్లకు...

గోదావరి - బనకచర్ల ప్రాజెక్టుకు మద్దకు...

ఏపీకి కేంద్రం భారీ...

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ది కోసం...

రోడెక్కుతున్న తూర్పు కాపులు.....

తూర్పు కాపులో తొలిసారి రోడెక్కారు. ప్రధానంగా...

కింగ్ పిన్ చుట్టూ...

వేల కోట్ల మద్యం కుంభకోణం, రవాణా...

పోల్స్