Wednesday, June 10, 2026 08:01 PM
Wednesday, June 10, 2026 08:01 PM

ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు..!

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఓ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. అదేమిటంటే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరును గొడ్డలి పార్టీ అని ప్రతి సమావేశంలో కూడా ప్రస్తావిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో గొడ్డలి పార్టీ నేతలను తరిమికొట్టాలంటున్నారు. అసలు ఏపీ డెవలప్‌మెంట్‌కు గొడ్డలి పార్టీ నేతలు బ్రేకులు వేస్తున్నారని.. రాష్ట్రానికి ప్రాజెక్టులు, కంపెనీలు రాకుండా కేసులు వేసి అడ్డుకుంటున్నారని కూడా చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సైకో అంటూ సంబోధిస్తున్నారు. ఐదేళ్ల పాటు ఏపీలో సైకో పాలన జరిగిందని ప్రతి చోట గుర్తు చేస్తున్నారు.

Also Read : అప్పుడు గుర్తు లేదా.. ఇప్పుడే యాదికి వచ్చిందాఅంబటి..?

చంద్రబాబు చేస్తున్న గొడ్డలి ఆరోపణలు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి అనేది అందరికీ తెలిసిన విషయం. వివేకానంద రెడ్డిని గొడ్డలితో హత్య చేశారని.. అయితే ముందు గుండె పోటు అని చిత్రీకరించే ప్రయత్నం చేశారని.. సొంత బాబాయ్‌ను జగన్ హత్య చేయించారనేది టీడీపీ నేతల ఆరోపణ. అందుకే వైసీపీ నేతలు జగన్‌కు ఎదురు చెప్పేందుకు భయపడతారని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎదురు చెబితే.. బాత్రూమ్‌లో గుండె పోటు వస్తుందనే విషయం వైసీపీలో ప్రతి నాయకుడికి, కార్యకర్తకు కూడా తెలుసంటున్నారు. ఈ వ్యాఖ్యలకు వైసీపీ నేతలంతా సైలెంట్ అవుతున్నారు.

అయితే చంద్రబాబు చేస్తున్న గొడ్డలి పార్టీ వ్యాఖ్యలకు వైసీపీ నేతల్లో కొందరు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీని గొడ్డలి పార్టీ అనే ముందు ఎన్‌టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనే విషయం మర్చిపోయారా.. అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే వివేకానంద రెడ్డి హత్య జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అని.. కాబట్టి.. ఆ హత్య విషయంలో ఏపీ ఇంటెలిజెన్స్ పూర్తిగా విఫలమైందని తాజాగా మాజీ మంత్రి రోజా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో చంద్రబాబు పైన ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో రోజా సహా వైసీపీ నేతల పైన నెటిజన్లు, టీడీపీ అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

Also Read : స్టీల్ ప్లాంట్.. నిర్లక్ష్యంతో బూడిదవుతున్న కార్మికులు..!

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగింది 2019 ఫిబ్రవరి నెలలో అని.. ఆ తర్వాత నెల రోజులకే జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిందన్నారు. 2019 మే నెలలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. కేసును ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత బాబాయ్ హత్య కేసును కూడా విచారించకుండా.. అసలైన నిందితులను దాచిపెట్టిన ఘనత వైసీపీ అధినేత జగన్‌కే దక్కుతుందని ఎద్దేవా చేస్తున్నారు. ఐదేళ్ల పదవీ కాలంలో సొంత బాబాయ్ హత్య కేసులో నిందితులను జగన్ సర్కార్ పట్టుకోలేకపోయిందని.. ఇక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా నడిపారో అర్థమవుతుందంటున్నారు. గొడ్డలి వేటు గురించి సొంత చెల్లెలు ఎవరి మీద ఆరోపణలు చేస్తున్నారో వైసీపీ నేతలు తెలుసుకోవాలని.. ఆ తర్వాత చంద్రబాబు పైన విమర్శలు చేయాలని సూచిస్తున్నారు. ఇలా ఎదురుదాడి చేస్తున్నారు కాబట్టే.. గొడ్డలి పార్టీ అనే పేరు సరిగ్గా సరిపోయిందంటున్నారు. బాబాయ్ హత్యకు గొడ్డలికి ఉన్న లింక్ తెలియదా.. ఇంత చిన్న లాజిక్కు ఎలా మిస్సయ్యారని కౌంటర్ ఇస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

భాగ్యనగరం.. ఒక్క వర్షం.....

భారీ వర్షం హైదరాబాద్ మహానగరాన్ని మరోసారి...

కూటమిలో కుంపటి పెట్టిన...

కూటమి పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయా..?...

వైసీపీ రాజకీయం.. మాయమయిన...

విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్...

పేర్ని దూకుడుకు బ్రేకులు...

వై నాట్ 175 అన్నారు.. 30...

విశాఖ KGHకు లోకేష్‌.....

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై తీవ్ర...

నా పేరు వాడుకోవద్దు...

తమిళనాడు రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో...

పోల్స్