Friday, September 18, 2026 12:20 AM
Friday, September 18, 2026 12:20 AM

అప్పుడు గుర్తు లేదా.. ఇప్పుడే యాదికి వచ్చిందా అంబటి..?

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబును నెటిజన్లు ప్రశ్నలతో నిలదీస్తున్నారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఆయనను విమర్శల పాలు చేస్తున్నాయి. జనసేన పార్టీ అధినేత,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పదే పదే కులం పేరుతో టార్గెట్ చేసే అంబటి.. ఇటీవల రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై పవన్‌ను మరోసారి కులం పేరుతో తీవ్ర విమర్శలు చేశారు. ఇదే ఆయనకు ఇప్పుడు తలనొప్పులు తెచ్చిపెట్టింది. “కరగట్టు పక్కనుంచి హైవే పక్క వరకు.. బరువైన బ్యాగులు మోసి చేతులు కందిపోయిన కార్పొరేట్ కార్మికుడికి, “అసలైన సిసలైన జనసైనికుడికి” రాజ్యసభ కేటాయించిన
కళ్యాణ్ గారికి అభినందనలు.” అంటూ అంబటి సెటైర్లు వేశారు.

Also Read : స్టీల్ ప్లాంట్.. నిర్లక్ష్యంతో బూడిదవుతున్న కార్మికులు..!

దీంతో అంబటిని నెటిజన్లు టార్గెట్ చేశారు. ఇందులో ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం టీడీపీతో జనసేన అధికారం పంచుకుంటుందన్నారు. తాము పాలేరు కాపులు కాదని.. జగన్ దగ్గర అంబటి పెట్టినట్లుగా ఎప్పుడూ వంగి వంగి దండాలు పెట్టలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. కూటమి సర్కార్‌లో టీడీపీ, జనసేన పార్టీల నేతలు ఓ కుటుంబ సభ్యుల్లా ఉన్నారని.. పవన్‌ను లోకేష్ ఒక అన్నలా భావిస్తున్నారని గుర్తు చేశారు. అధికారంలో భాగస్వాములే తప్పా, జగన్ రెడ్డి పాలేరులం అని పేర్ని నాని అన్నట్లు ఎవరికీ పాలేరులం కాదంటున్నారు.

Also Read : నా పేరు వాడుకోవద్దు ప్లీజ్..!

ఇక అసలు విషయం ఏమిటంటే.. మీ నాయకుడు కాపులకు ఒక రాజ్యసభ సిటైనా ఇచ్చారా..? చంద్రబాబు కాపులకు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్లు కూడా జగన్ రద్దు చేసినపుడు మీ నోరు మూగపోయిందా..? పవన్ కళ్యాణ్ పైన వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేసినపుడు.. అది తప్పు అని ఎప్పుడైనా అన్నారా..? లింగంనేని రమేష్‌కు రాజ్యసభ సీటు జనసేన తరఫున ఇచ్చారు. లింగమనేని రమేష్ 2015 నుంచి జనసేనలో కొనసాగుతున్నారు. పార్టీ తరపున పవన్ కళ్యాణ్ రాజ్యసభ సీటు ఎవరికి ఇస్తే మీకు మంట ఎందుకు అంబటి గారు.. అని విమర్శిస్తున్నారు. వైసీపీ హయాంలో రాజ్యసభ సీట్లు మొత్తం రెడ్డి సామాజిక వర్గానికే ఇచ్చినప్పుడు మీరు జగన్‌ మోహన్ రెడ్డిని ఎందుకు డిమాండ్ చేయలేదంటున్నారు.

Also Read : రెండు పదవులు చాలవా.. మరో పదవి కావాలా..!

వైసీపీలో జగన్ మోహన్ రెడ్డిని ఒక్కసారి అయినా కాపులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించి ఉంటే.. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించే అర్హత ఉంటుందని.. అప్పుడు ఎందుకు అడగలేదని నిలదీస్తున్నారు. పేర్ని నాని, అంబటి రాంబాబులు తాము కాపులమని.. కాపు సామాజిక వర్గానికి తమ వల్లే మేలు జరుగుతుందని పదే పదే చెప్తుంటారు తప్ప.. వైసీపీలో కాపులకు పదవులు ఎందుకు రాలేదని ఒక్కసారైనా అడిగారా అని నిలదీస్తున్నారు. మొత్తానికి అంబటి నోటి దూల.. ఇప్పుడు ఆయనకే బూమ్ రాంగ్ అయ్యింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్