Tuesday, June 9, 2026 09:16 PM
Tuesday, June 9, 2026 09:16 PM

విశాఖ KGHకు లోకేష్‌.. స్టీల్‌ ప్లాంట్ ప్రమాద బాధితులకు భరోసా..!

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్. రష్యా పర్యటన అలా ముగిసిందో లేదో..స్టీల్ ప్లాంట్ ఘోర ప్రమాద వార్త విని నేరుగా విశాఖ చేరుకున్నారు లోకేష్. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా..మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం ఉదయమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధుల బృందాన్ని వెంటబెట్టుకుని కేజీహెచ్‌కు చేరుకున్న లోకేష్, మృతుల కుటుంబాలను, బాధితులను పరామర్శించి వారికి భరోసా కల్పించారు.

Also Read : రెండేళ్ల పాలనపై సర్వే.. ఎవరికెన్ని మార్కులు..?

KGH ఆసుపత్రిలో ప్రమాదం జరిగిన తీరును, బాధితులకు అందుతున్న అత్యవసర వైద్య సేవలను మంత్రి నారా లోకేష్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్న బాధిత కుటుంబ సభ్యులను లోకేష్ దగ్గరకు తీసుకుని ఓదార్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడొద్దంటూ ఆయన కల్పించిన భరోసా ఆ కుటుంబాల్లో ధైర్యాన్ని నింపింది. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మతో కలిసి లోకేష్ ప్రతి ఒక్కరినీ పలకరించి, బాధితులకు పూర్తి స్థాయిలో వైద్య సహాయం అందేలా చూడాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు.

Also Read : వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం..!

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్ మనందరి సెంటిమెంట్ అని, గతంలో అందరం కలిసికట్టుగా పోరాడటం వల్లే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోగలిగామని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఈ కష్టసమయంలోనూ కార్మికులను, వారి కుటుంబాలను ఒంటరిగా వదిలే ప్రసక్తే లేదని, బాధిత కుటుంబాలకు జీవితాంతం కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తేల్చి చెప్పారు. ఈ ప్రమాద ఘటనపై ఇప్పటికే ఉన్నత స్థాయి విచారణ కమిటీని నియమించామని, కమిటీ నివేదిక వచ్చిన వెంటనే బాధ్యులెవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని లోకేష్ హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కఠినమైన సేఫ్టీ స్టాండర్డ్స్ అమలు చేస్తామన్నారు.

Also Read : టీడీపీలో రాజ్యసభ రచ్చ..!

ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్-గ్రేషియాను ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి తక్షణమే ప్రకటించారు. మృతుల కుటుంబాల్లోని అర్హులకు ఉద్యోగ భద్రతతో పాటు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ప్యాకేజీ ద్వారా ఆర్థిక సహాయం అందించేలా ప్లాంట్ యాజమాన్యంతో కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ, మంత్రి లోకేష్ చర్చలు జరుపుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం విశాఖ అధికారులతో మాట్లాడుతుండటం, లోకేష్ స్వయంగా రంగంలోకి దిగడంతో బాధిత కుటుంబాల రక్షణకు NDA ప్రభుత్వం సంపూర్ణ బాధ్యత తీసుకుంటుందనే నమ్మకం వ్యక్తమవుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నా పేరు వాడుకోవద్దు...

తమిళనాడు రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో...

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో...

విశాఖపట్నంలోని విశాఖ ఉక్కు కర్మాగారంలో సోమవారం...

రెండేళ్ల పాలనపై సర్వే.....

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన...

విద్యార్థుల కోసం సర్కార్...

రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఎన్నో ఉచిత...

టీడీపీలో రాజ్యసభ రచ్చ..!

రాజ్యసభ సభ్యుల ఎంపిక తెలుగుదేశం పార్టీలో...

సామాన్యుడి కోరిక తీర్చనున్న...

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక...

పోల్స్