Saturday, August 1, 2026 08:07 PM
Saturday, August 1, 2026 08:07 PM

విద్యార్థుల కోసం సర్కార్ మరో హామీ..!

రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఎన్నో ఉచిత పథకాలు అమలు చేస్తున్నాయి. గత ఎన్నికల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చాయి. మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం ఇప్పటికే ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. త్వరలో తమిళనాడులో కూడా అమలు చేసేందుకు అక్కడి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో కొత్తగా ఏర్పడిన డీకే శివకుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం.. మరో ఉచిత పథకానికి శ్రీకారం చుట్టింది. కేబినెట్ తొలి సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా యువతకు కనెక్ట్ అయ్యేలా.. వచ్చే ఎన్నికల్లో యువతను మరింత అకర్షించేందుకు కీలక ప్రకటన చేశారు డీకే శివకుమార్.

Also Read : టీడీపీలో రాజ్యసభ రచ్చ..!

నిరుద్యోగ సమస్య రూపుమాపేందుకు, విద్యార్థులకు మరింత ప్రోత్సాహం అందించేందుకు ఫ్రీ బస్ పాస్ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు అందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఇకపై ఫ్రీ బస్ ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. దీని వల్ల విద్యాభివృద్ధికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్వయంగా ప్రకటించారు. విద్యార్థులకు ఫ్రీ బస్ స్కీమ్ ప్రకటించి ఆకట్టుకున్నారనే ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు అవుతోంది. తాజాగా విద్యార్థులకు కూడా అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రకటించారు.

Also Read : సామాన్యుడి కోరిక తీర్చనున్న సీఎం..!

కర్ణాటక సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పటికే ప్రశంసలు వెల్లువెత్తడంతో.. ఇదే బాటలో నడిచేందుకు తెలంగాణ సర్కార్ కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ అమలవుతోంది. తాజాగా విద్యార్థులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ సౌకర్యం కల్పించాలని భావిస్తున్నారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందిస్తున్నారు. 12వ తరగతి వరకు విద్యార్థులకు ఉచిత భోజనం అందిస్తున్నారు. అలాగే అదనపు బోధన కోసం ప్రత్యేక ట్యూటర్లు కూడా అందుబాటులో ఉన్నారు. నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేక స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే పిల్లల కోసం ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్జి ప్రకటన చేశారు. ముఖ్యంగా విద్యాభివృద్ధికి ఈ నిర్ణయం ఎంతో ఉపకరిస్తుందనే మాట బాగా వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఉత్తరాంధ్ర కాదు.. ఇక...

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి...

ఇదీ ఉత్తరాంధ్ర దెబ్బ.....

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ...

మోడీని దారుణంగా మాట్లాడారు.....

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ...

భోగాపురంలో చరిత్ర సృష్టించిన...

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమవుతూ,...

అంతర్జాతీయ అద్భుతం.. మన...

విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా...

భోగాపురం భోగం ఎవరిది.....

మరికొన్ని గంటల్లో విజయనగరం జిల్లా భోగాపురంలో...

పోల్స్