Monday, June 8, 2026 08:00 PM
Monday, June 8, 2026 08:00 PM

టీడీపీలో రాజ్యసభ రచ్చ..!

రాజ్యసభ సభ్యుల ఎంపిక తెలుగుదేశం పార్టీలో రచ్చ లేపుతోంది. నాలుగు స్థానాల్లో మూడు టీడీపీ, ఒకటి జనసేన తరఫున అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. జనసేన తరఫున లింగమనేని రమేశ్ నామినేషన్ దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున చింతకాయల విజయ్, సానా సతీష్, భాష్యం రామకృష్ణ పేర్లను చంద్రబాబు నాయుడు ఫైనల్ చేశారు. దీంతో రాజ్యసభ అవకాశం కోసం ఎదురు చూసిన నేతలు ఇప్పుడు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అదే సమయంలో గతంలో అధినేత హామీ ఇచ్చిన నేతలు.. ఈ దఫాలో అవకాశం రాకపోవడంపై అలక వహించారు. కొందరు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేయగా.. మరి కొందరు మాత్రం.. సైలెంట్‌గా సైడ్ అయ్యారు.

Also Read : సామాన్యుడి కోరిక తీర్చనున్న సీఎం..!

రాజ్యసభకు నాలుగు స్థానాలకు జరుగుతున్న ఎన్నిక ఏకగ్రీవం కానుంది. పేరుకే జనసేన పార్టీ అభ్యర్థి అయినప్పటికీ లింగమనేని రమేష్‌కు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులే బలపరుస్తూ సంతకాలు చేశారు. ఇక టీడీపీ తరఫున కూడా ఎన్నిక లాంఛనమే. ప్రకటించిన నలుగురు నేతల్లో లింగమనేని రమేశ్, భాష్యం రామకృష్ణ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు కాగా.. సానా సతీష్ కాపు సామాజిక వర్గం. ఇక బీసీ అభ్యర్థిగా చింతకాయల విజయ్‌ను ఎంపిక చేశారు. ఈ ఎంపికపై పార్టీలో కొందరు సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చింతకాయల విజయ్ ఎంపికతో పాటు సానా సతీష్, భాష్యం రామకృష్ణ ఎంపికను కొందరు తప్పుబడుతున్నారు.

Also Read : మిత్రులే మోసం చేస్తున్నారా..? సంక్షోభంలో INDIA కూటమి

రామకృష్ణ సోదరుడు ప్రవీణ్ ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్నారు. విజయ్ తండ్రి అయ్యన్నపాత్రుడు కూడా స్పీకర్‌గా కొనసాగుతున్నారు. పైగా విజయ్ చాలా చిన్న వయసు. ఇప్పుడు కాకపోయినా.. మరోసారి అవకాశం ఇవ్వచ్చు అనే మాట బాగా వినిపిస్తోంది. యువకుడిని పెద్దల సభకు పంపడం అవసరమా అంటున్నారు. సానా సతీష్‌‍ను లోకేష్‌కు సన్నిహితుడు అనే ఒకే ఒక కారణంతోనే మరోసారి అవకాశం ఇచ్చారనేది సీనియర్ల మాట. రాజ్యసభ సీటు ఆశించిన యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, దేవినేని ఉమాతో పాటు రెడప్పగారి శ్రీనివాసరెడ్డి కూడా ఇప్పుడు తీవ్ర అసహనంతో ఉన్నారు. వీరిలో యనమల, దేవినేని ఇప్పటి వరకు బయట పడలేదు.

Also Read : రవి నాయుడే టార్గెట్ ఎందుకు..?

ఇక వర్ల రామయ్య ఏకంగా నెల రోజులుగా బయటకు రావటం లేదు. దాదాపు రెండు నెలలుగా వర్ల రామయ్య మీడియా ముందుకు రావటం లేదు. వైసీపీ నేతలు డీఎస్సీ సహా పలు అంశాలపై చంద్రబాబు, లోకేష్‌తో పాటు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నా కూడా.. వర్ల రామయ్య కనీసం స్పందించటం లేదు. వాస్తవానికి గతంలో కూడా వర్ల రామయ్య పేరును రాజ్యసభకు ఎంపిక చేసిన చంద్రబాబు నాయుడు.. చివరి నిమిషంలో ఆయన స్థానంలో సీఎం రమేష్‌కు పార్టీ బీ ఫారం ఇచ్చారు. ఆ తర్వాత సీఎం రమేశ్ టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇప్పుడు కూడా ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుంచి వర్ల రామయ్యకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ వినిపించింది. కానీ ఆయన పేరు లేకపోవడంతో ఆయన సైలెంట్ అయ్యారు. దీంతో వర్లను ఎంఆర్‌పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ నేరుగా ఇంటికి వెళ్లి మరీ సంప్రదింపులు జరిపారు.

రెడప్పగారి శ్రీనివాసరెడ్డి అయితే తన అసహనాన్ని ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “గత 13 సంవత్సరాలుగా కడప లాంటి అత్యంత క్లిష్టమైన రాజకీయ పరిస్థితులు ఉన్న జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తూ, పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేశాను. రాజకీయ, ఆర్థిక, మానసిక, శారీరక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పార్టీ జెండా ఎప్పటికీ ఎగురుతూ ఉండాలనే సంకల్పంతో పని చేశాను. పార్టీ అధిష్టానం నాకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని ఇచ్చిన హామీ నెరవేరకపోవడం వ్యక్తిగతంగా ఎంతో కలతకు గురి చేసింది. పార్టీ కోసం నిస్వార్థంగా శ్రమించిన నాయకులను, కార్యకర్తలను తగిన సమయంలో గుర్తించకపోవడం బాధాకరం. ముఖ్యంగా నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం నా రాజకీయ జీవితంలో అత్యంత నిరాశ కలిగించిన సంఘటనగా మిగిలిపోతుంది. కార్యకర్తల కోసం, ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం నా శక్తి మేరకు కృషి చేస్తూనే ఉంటాను.” అంటూ సోషల్ మీడియా వేదికగా తన అసహనాన్ని నేరుగా అధినేత చంద్రబాబు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్‌ను ట్యాగ్ చేసి మరీ తెలిపారు. దీంతో తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ రచ్చ తారాస్థాయికి చేరుకున్నట్లు అయ్యింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో...

విశాఖపట్నంలోని విశాఖ ఉక్కు కర్మాగారంలో సోమవారం...

రెండేళ్ల పాలనపై సర్వే.....

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన...

విద్యార్థుల కోసం సర్కార్...

రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఎన్నో ఉచిత...

సామాన్యుడి కోరిక తీర్చనున్న...

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక...

పైసాకు పలికే ప్రొఫెసర్...

తెలంగాణ సమాజంలో మేధావిగా, విశ్లేషకుడిగా చలామణి...

రష్యా హై అలర్ట్...

ఉక్రెయిన్-రష్యా యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారుతున్న...

పోల్స్