తెలంగాణ సమాజంలో మేధావిగా, విశ్లేషకుడిగా చలామణి అవుతున్న ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అసలు రంగు బయటపడుతోంది. విశ్లేషణల పేరుతో తెరవెనుక పొలిటికల్ అజెండాలు నడుపుతూ, ప్యాకేజీలకు లొంగిపోతారనే ఆరోపణలు ఇప్పుడు మీడియా వర్గాల్లోనే తీవ్ర సంచలనం రేపుతున్నాయి. మొన్న తెలంగాణ విఠల్, నిన్న టీజేయూ సదస్సులో మరో సీనియర్ జర్నలిస్ట్ నేరుగా నాగేశ్వర్ తీరును ఎండగట్టడంతో.. పైసాకి పలికే ప్రొఫెసర్ అంటూ మండిపడుతున్నారు. తెలంగాణ జర్నలిస్టుల యూనియన్ ఆధ్వర్యంలో నిన్న జరిగిన ఒక సదస్సు ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు వ్యతిరేకంగా ఒక వేదికగా మారింది.
Also Read : ఎల్పీజీ కష్టాలు.. ఉపాధిపై ప్రభావం..!
ఈ సదస్సులో పాల్గొన్న ఒక సీనియర్ జర్నలిస్ట్ నాగేశ్వర్ తీరుపై నిప్పులు చెరిగారు. నిష్పాక్షిక విశ్లేషకుడిని అని చెప్పుకుంటూ, పద్ధతి ప్రకారం నిర్దిష్ట పార్టీలకు అనుకూలంగా నేరేటివ్ బిల్డ్ చేయడంపై ఆయన మండిపడ్డారు. హైదరాబాద్‌లో 100 మంది ఇలాంటి ముసుగు దొంగల ముఠా ఉందంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇన్ని రోజులు తాను సీపీఎం కార్యకర్తను అని ఎందుకు బయటకు చెప్పుకోలేదన్నారు. తన వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకున్నానని చెప్పిన నాగేశ్వర్.. పాశం యాదగిరి మాటలను ఎందుకు వ్యతిరేకించలేదని మండిపడ్డారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రతి చర్య వెనుక డబ్బు ఉంటుందన్నారు.
నాగేశ్వర్ రంగు మారిందని, ఆయనను ప్రొఫెసర్ నాగేశ్వర్ అని పిలవొద్దని, సీపీఎం నాగేశ్వర్ అని పిలవాలని సూచించారు. బూటకపు తెలంగాణవాదంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. మేధావి ముసుగులో లోపల పక్కా రాజకీయాలు చేయడం మానేసి.. ధైర్యం ఉంటే ఏదైనా ఒక పార్టీ కండువా కప్పుకుని నేరుగా బరిలోకి దిగాలి అంటూ సదస్సు వేదికగా సవాల్ విసిరారు. ఒక జర్నలిస్ట్‌గా ఉంటూ కనీస విలువలు లేకుండా ప్యాకేజీల కోసమే విశ్లేషణలు మారుస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మీడియా సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
ప్రొఫెసర్ నాగేశ్వర్ డబుల్ స్టాండర్డ్స్‌పై కేవలం నిన్నటి సదస్సులోనే కాదు.. మొన్న తెలంగాణ విఠల్ సైతం ఓ ఇంటర్వ్యూలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒకప్పుడు ఉద్యమ కాలంలో, ఆ తర్వాత వివిధ సందర్భాల్లో నాగేశ్వర్ అనుసరించిన అవకాశవాద రాజకీయాలను విఠల్ సాక్ష్యాలతో సహా ఎండగట్టారు. సమాజానికి నీతులు చెప్పే ప్రొఫెసర్ గారు, తెరవెనుక ఏ రకంగా లబ్ధి పొందుతున్నారో.. ఎవరి ప్రయోజనాల కోసం యూట్యూబ్ వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో విఠల్ తన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
Also Read : వైసీపీ నేత కబ్జాపై మౌనం.. పవన్‌పై ఫేక్ ప్రచారం.. ఇదేమి తెలంగాణవాదం?
నిజాలు మాట్లాడుతున్నట్లు నటిస్తూ.. లోపల మాత్రం పైసాలకు లొంగిపోయే మనస్తత్వం నాగేశ్వర్ ది అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఒకప్పుడు ఉన్న క్రెడిబిలిటీని పక్కన పెట్టి, కేవలం కొన్ని పొలిటికల్ మేనేజ్‌మెంట్‌లలో భాగస్వామిగా మారి యూట్యూబ్ వీడియోల ద్వారా ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా నిష్పాక్షిక ముసుగు తీసి, ఏ పార్టీ స్క్రిప్ట్ చదువుతున్నారో ఆ పార్టీ జెండా పట్టుకోవాలని తెలంగాణ మేధావి వర్గాలు సైతం నాగేశ్వర్‌కు హితవు పలుకుతున్నాయి.

