Thursday, September 17, 2026 08:06 PM
Thursday, September 17, 2026 08:06 PM

తెలుగులో నా ఫేవరేట్ హీరో అతనే.. ఇలియానా సంచలన కామెంట్స్

ఒకప్పుడు టాలీవుడ్‌ను ఊపేసిన స్టార్ హీరోయిన్ గోవా బ్యూటీ ఇలియానా. తనదైన గ్లామర్, నటనతో కుర్రకారు గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఈ అమ్మడు.. తెలుగులో దాదాపు అందరు అగ్ర హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. మొదటి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు సరసన ఆమె నటించిన పోకిరి చిత్రం ఇలియానా కెరీర్ మలుపు తిప్పింది. ఈ మూవీతో ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఇలియానా.. ఇప్పుడు తన ఇద్దరూ కుమారులతో కలిసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.

Also Read : ఫోర్స్ లేబర్.. ట్రంప్ డబుల్ గేమ్..!

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఇలియానా టాలీవుడ్ స్టార్ హీరోలపై చేసిన కామెంట్స్ నందమూరి అభిమానులను తెగ ఖుషీ చేస్తున్నాయి. యాంకర్ ఇలియానాను ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. “మీరు నటించిన హీరోల్లో.. జూనియర్ ఎన్టీఆర్ (తారక్), రామ్, మహేష్ బాబు, ప్రభాస్.. వీరిలో ఎవరితో మీ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందని మీరు అనుకుంటున్నారు?” అని ప్రశ్నించారు. దీనికి ఇలియానా కాసేపు ఆలోచించి “నేనైతే తారక్ (Tarak) అనే చెప్తాను. తారక్‌తోనే నా స్క్రీన్ కెమిస్ట్రీ బెస్ట్” అంటూ ఎన్టీఆర్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించింది.

Also Read : కేటీఆర్ పాదయాత్ర.. వర్కవుట్ అవుతుందా..?

జూనియర్ ఎన్టీఆర్, ఇలియానా కాంబినేషన్‌లో కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రాఖీ’ (Rakhi – 2006), అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘శక్తి’ (Shakti – 2011) సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా ‘రాఖీ’ సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే లవ్ ట్రాక్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తారక్ ఎనర్జీకి మ్యాచ్ అవుతూ ఇలియానా అప్పట్లో చేసిన డ్యాన్స్ స్టెప్స్ కూడా ఒక ఊపు ఊపాయి. మహేష్ బాబుతో ‘పోకిరి’, ప్రభాస్‌తో ‘మున్నా’, రామ్‌తో ‘దేవదాసు’ వంటి భారీ హిట్స్ ఉన్నప్పటికీ.. నటన, టైమింగ్ విషయంలో తారక్‌తో ఉన్న కంఫర్ట్ లెవెల్స్ వేరని ఇలియానా చెప్పకనే చెప్పింది. ఇలియానా చేసిన ఈ కామెంట్స్ పాతవే అయినప్పటికీ, ప్రస్తుతం ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్‌గా దూసుకుపోతున్న తరుణంలో ఈ వీడియోను తారక్ ఫ్యాన్స్ నెట్టింట విపరీతంగా షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్