Saturday, June 6, 2026 01:14 AM
Saturday, June 6, 2026 01:14 AM

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. నిత్యం ప్రజాసేవ, ప్రభుత్వ సమీక్షలతో బిజీగా ఉండే 76 ఏళ్ల చంద్రబాబు..సామాన్యుడిలా సైకిల్ తొక్కుతూ విశాఖ నగరవాసులను, పార్టీ శ్రేణులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ భూమి మన ఇల్లు.. ప్రకృతి మన జీవనాధారం అనే నినాదంతో, పచ్చదనం పెంపుదల, కాలుష్య నియంత్రణే ధ్యేయంగా ఆయన సైకిల్ ప్రయాణం సాగింది.

Also Read : పవన్‌పై ప్రకాష్ రాజ్ సెటైర్.. బండ్ల ఘాటు కౌంటర్..!

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. విజయవాడ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన ముఖ్యమంత్రి, ఉదయం 10 గంటలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడ దిగిన వెంటనే ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి గుర్తుగా మైదాన ప్రాంగణంలో ఒక మొక్కను నాటారు. ఆ తర్వాత తన సొంత వాహన శ్రేణిని పక్కన పెట్టి, పర్యావరణ హిత సందేశాన్ని స్వయంగా చాటిచెప్పేందుకు సైకిల్ ఎక్కారు. AU ఇంజనీరింగ్ కాలేజీ రోడ్డు నుంచి ప్రారంభమైన బాబు సైకిల్ సవారీ.. 3 టౌన్ పోలీస్ స్టేషన్, కరకచెట్టు పోలమాంబ ఆలయం, ENT, చెస్ట్ ఆస్పత్రుల మీదుగా ఈస్ట్ పాయింట్ కాలనీ దాటుకుంటూ సుందరమైన విశాఖ బీచ్ రోడ్డులోకి ప్రవేశించింది.

అక్కడి నుంచి ఉడా పార్క్, పార్క్ హోటల్ జంక్షన్‌ల మీదుగా సాగిన ఈ యాత్ర..జాతీయ సదస్సు జరిగే నోవాటెల్ హోటల్ వరకు సుమారు 9 కిలోమీటర్ల మేర కొనసాగింది. ఎండను సైతం లెక్కచేయకుండా చంద్రబాబు అత్యంత ఉత్సాహంగా, స్ఫూర్తిదాయకంగా సైకిల్ తొక్కుతుంటే.. దారిపొడవునా ప్రజలు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హర్షధ్వానాలతో ఆయనకు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రితో పాటు పార్టీ ప్రముఖులు, స్థానిక నేతలు కూడా సైకిళ్లు తొక్కుతూ బాబుతో అడుగులు కలిపారు.

Also Read : రష్యాలో లోకేష్ మిషన్.. ఏపీకి భారీ పెట్టుబడులు

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా, పర్యటన ముగింపులోనూ ప్రజలకు ఒక బలమైన పర్యావరణ సందేశాన్ని ఇచ్చారు. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడం, సహజ వనరులను కాపాడుకోవడం మనందరి ఉమ్మడి బాధ్యత. గాలి, నీరు, నేల కలుషితం కాకుండా చూడాలంటే ప్రతి ఒక్కరూ సుస్థిర జీవన విధానాన్ని అలవర్చుకోవాలి. హానికరమైన కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు నిత్య జీవితంలో వీలైనంత వరకు సైకిళ్లు, ఈ-సైకిళ్లను వినియోగించాలి. ఇంధనాన్ని ఆదా చేస్తూనే, పచ్చదనాన్ని పెంచడానికి ప్రతి పౌరుడూ కనీసం ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత కాదని, ప్రతి ఒక్కరి కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రఘురామపై ఇద్దరి దాడి.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల డిప్యూటీ స్పీకర్...

రాజ్యసభ అభ్యర్థి ఎంపిక.....

అంతా అనుకున్నట్లే జరిగింది. ప్రస్తుత రాజ్యసభ...

ఏపిలో దూకుడు పెంచిన...

జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం...

రష్యాలో లోకేష్ మిషన్.....

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో సరికొత్త మైలురాళ్లు...

కేబినెట్ విస్తరణ.. జస్ట్...

ఏపీలో మంత్రివర్గ విస్తరణపై కొద్ది రోజులుగా...

అసలు పెద్ద సారు...

తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా ఉన్నాయి....

పోల్స్