Monday, June 1, 2026 05:00 PM
Monday, June 1, 2026 05:00 PM

టీడీపీలో రాజ్యసభ సీట్లు విధేయులకా లేక అవకాశవాదులకా?

తెలుగుదేశం పార్టీ అనగానే క్రమశిక్షణ కలిగిన నేతలు, కార్యకర్తలే గుర్తుకు వస్తారు. పార్టీ అధికారంలో ఉన్నా సరే.. ప్రతిపక్షంలో ఉన్నా సరే.. ధైర్యంగా నిలబడేది పసుపు సైనికుడే. ఇదే మాట ఒంగోలు మహానాడుతో రుజువైంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కలేనన్ని అరాచకాలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ జెండా కనిపిస్తే చాలు.. వైసీపీ నేతలు, కార్యకర్తలు వెర్రెత్తి పోయారు. దీంతో చాలా మంది ఊర్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. కానీ.. ఒంగోలులో నిర్వహించిన మహానాడుకు పసుపు దండు పోటెత్తింది. నాటి నుంచి తెలుగుదేశం కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పని చేశారు. పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చారు. చంద్రబాబును మరోసారి సీఎం కుర్చీలో కూర్చొబెట్టారు.

Also Read : తెలంగాణపై జనసేనాని గురి.. పార్టీ నేతలతో కీలక భేటీ..!

టీడీపీకి బలం నిజమైన కార్యకర్త మాత్రమే. అందుకే 1983 నుంచి కూడా పార్టీ కోసం కష్టపడిన వారికే వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు పెద్ద పీట వేశారు. నామినేటెడ్ పదవులు, చట్టసభలకు ప్రాతినిధ్యం కూడా.. కేవలం విధేయులకు, పార్టీ కోసం కష్టపడిన వారికి, నిబద్ధతతో పని చేసిన వారికే కేటాయించారు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. రాజ్యసభ సీట్లు విధేయుల కంటే కూడా.. అవకాశవాదులకే ఎక్కువ కేటాయిస్తున్నట్లు పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని.. కేవలం కార్పొరేట్ పెద్దలకే కేటాయించారనేది కొద్ది రోజులుగా వినిపిస్తున్న ఆరోపణలు.

1984 నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ తరఫున దాదాపు 46 మంది రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. అయితే వీరిల్లో వరుసగా రెండోసారి రాజ్యసభకు వెళ్లిన నేతల్లో చాలా మంది పార్టీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు దక్కించుకున్న నేతలు.. ఓడిన వెంటనే.. సైలెంట్‌గా పార్టీ మారిపోయారు. దీని వల్ల అసలైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. 2014-19 మధ్య కాలంలో అధికారంలో ఉన్న సమయంలో.. పార్టీ తరఫున కొందరు రాజ్యసభకు ఎన్నికయ్యారు. పార్టీ ఓడిన తర్వాత వీళ్లంతా సైలెంట్‌గా బీజేపీలో చేరిపోయారు. దీని వల్ల తొలిసారి పార్లమెంట్‌లో టీడీపీకి గుర్తింపు లేకుండా పోయింది.

Also Read : ఇరాన్ రూట్ బంద్.. భారత్ మాత్రం సేఫ్, కేంద్రం సీక్రెట్ వ్యూహం ఇదే..!

ఎన్టీఆర్ హయాంలో విధేయులకు ప్రాధాన్యం ఇచ్చారని.. కానీ ఇప్పుడు మాత్రం.. కార్పొరేట్ కల్చర్ పెరిగిందని టీడీపీ సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి ఆర్థికంగా అండగా ఉండేందుకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే.. పెద్దలు మాత్రం.. కేవలం కార్పొరేట్ శక్తులనే పెద్దల సభకు పంపిస్తున్నారు. వారేమో.. తమ వ్యాపార కార్యకలాపాల కోసం సైలెంట్‌గా పార్టీ కండువా మార్చేస్తున్నారు. ఇక్కడ మరో విచిత్రమేమిటంటే.. అలాంటి వారినే పార్టీ అధినేత మళ్లీ చేరదీస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. మొత్తం నాలుగు స్థానాలు కూడా టీడీపీకే దక్కాలి. కానీ కూటమి పొత్తు కారణంగా.. రెండు టీడీపీ, ఒకటి జనసేన, మరొకటి బీజేపీ అనే మాట వినిపిస్తోంది.

బీజేపీ తరఫున ఏపీకి చెందిన నేతలు కాకుండా.. తమిళనాడుకు చెందిన అన్నామలై.. లేదా.. నిన్నటి వరకు వైసీపీ అభ్యర్థిగా ఉన్న ముఖేష్ అంబానీ సన్నిహితుడు పరిమణ్ నత్వానీ పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. జనసేన తరపున నిన్నటి వరకు లింగమనేని రమేశ్ పేరు బాగా వినిపించింది. కానీ ఇప్పుడు ఆయన స్థానంలో మహిళకు కేటాయించే అవకాశాలున్నట్లు సమాచారం. ఇదే సమయంలో టీడీపీ తరఫున రెండు స్థానాలకు ఎవరిని పంపిస్తారనే విషయం ఆసక్తిగా మారింది. పార్టీ కోసం కష్టపడిన వారికి ఇస్తారా.. లేక ఎప్పటి మాదిరి పార్టీకి వెన్నుపోటు పొడిచే స్వార్థపరులకు ఇస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read : ఎండాకాలంలో కోడిగుడ్లు తినవచ్చా..?

నిజానికి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచిన వారికి.. పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వారికి రాజ్యసభ అవకాశం ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. వీరిలో ప్రధానంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ పేరు బాగా వినిపిస్తోంది. వైసీపీ ఐదేళ్ల పదవీ కాలంలో టార్గెట్ చింతకాయల.. అన్నట్లుగా వ్యవహరించింది జగన్ సర్కార్. తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేసింది. చివరికి ఆస్తులు కూడా కోల్పోయిన పరిస్థితి. అయినా సరే.. విజయ్ మాత్రం భయపడలేదు. పార్టీ సోషల్ మీడియా బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు. ఎన్నికల్లో టీడీపీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. అందుకే ఈ సారి తప్పకుండా విజయ్ లాంటి కష్టపడిన వారినే రాజ్యసభకు పంపాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు. మరోసారి కార్పొరేట్ శక్తులకు అవకాశం ఇచ్చి కష్టపడిన వారికి అన్యాయం చేయవద్దని కోరుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

యుద్ధ భూమిలో లోకేష్...

ప్రపంచ రాజకీయాలు వేగంగా మారుతున్న ఈ...

లోకేష్-రాబిన్ ఖుదా భేటీ.....

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో డేటా సెంటర్లను...

కూటమికి దూరంగా టీ...

ప్రొఫెసర్ నాగేశ్వర్.. నిజానికి ఇది ఒక...

తెలంగాణపై జనసేనాని గురి.....

గత కొన్నాళ్ళుగా తెలంగాణ రాజకీయాలపై జనసేన...

ఏపీ ఇసుక స్కామ్‌...

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో...

గోదావరి జిల్లాల్లో మళ్లీ...

పోలవరం జిల్లా పరిధిలో పెద్దపులి సంచారం...

పోల్స్