Friday, September 18, 2026 02:54 AM
Friday, September 18, 2026 02:54 AM

మాజీ సీఎం అరెస్ట్ కు రంగం సిద్దం..?

కేరళ రాజకీయాల్లో సంచలనాల దిశగా అడుగులు పడుతున్నాయి. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం సీనియర్ నేత పినరయి విజయన్ నివాసాలే లక్ష్యంగా ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విస్తృత సోదాలు చేపట్టారు. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన మనీలాండరింగ్ వ్యవహారంలో ఈ దాడులు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఈడీ అధికారులు కేంద్ర రిజర్వ్ బలగాల రక్షణతో తెల్లవారుజాము నుంచే సోదాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

Also Read : బాలీవుడ్ ను రంగంలోకి దించుతున్న కొరటాల..!

తిరువనంతపురంలోని బేకరీ జంక్షన్ వద్ద పినరయి విజయన్ నివాసం ఉంటున్న అద్దె ఇల్లు, అలాగే కన్నూర్‌ లోని ఆయన స్వగృహంలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. విజయన్‌ తో పాటు కేరళవ్యాప్తంగా దాదాపు 12 కీలక ప్రాంతాలలో ఈ సోదాలు కొనసాగాయి. ఇందులో విజయన్ కుమార్తె వీణ విజయన్ భర్త, మాజీ మంత్రి పి.ఎ. మహమ్మద్ రియాస్ నివాసం కూడా ఉంది. సోదాల సమయంలో పినరయి విజయన్ కుటుంబ సమేతంగా ఇంట్లోనే ఉన్నారు. ఈ వివాదం పినరయి విజయన్ కుమార్తె టి. వీణకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ అనే ఐటీ సంస్థ చుట్టూ తిరుగుతోంది.

Also Read : అఖిల్ కెరీర్ మార్చే సినిమా ఇదేనా?

ప్రైవేట్ మైనింగ్ కంపెనీ అయిన సీఎంఆర్‌ఎల్ నుంచి 2017-2021 మధ్య కాలంలో ఎక్సాలాజిక్ సంస్థకు ఎలాంటి ప్రత్యక్ష సేవలు అందించకుండానే రూ. 1.72 కోట్ల మేర అక్రమంగా చెల్లింపులు జరిగాయనేది ప్రధాన ఆరోపణ. ఈ ఆర్థిక లావాదేవీలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసి విచారణను వేగవంతం చేసింది. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ కూడా ఈ వ్యవహారంపై ఇప్పటికే నివేదిక ఇచ్చింది. ఈ కేసులో ఈడీ జారీ చేసిన సమన్లను, విచారణను సవాల్ చేస్తూ సీఎంఆర్‌ఎల్ సంస్థ కేరళ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, ప్రాథమికంగా మనీలాండరింగ్ ఆనవాళ్లు ఉన్నాయని పేర్కొంటూ హైకోర్టు మంగళవారమే ఆ పిటిషన్‌ ను కొట్టేసింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్