Monday, May 25, 2026 11:51 PM
Monday, May 25, 2026 11:51 PM

వంగ మాస్టర్ ప్లాన్.. కాస్టింగ్‌ తోనే బాక్సాఫీస్‌ షేక్..!

రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న స్పిరిట్ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ యాక్షన్ డ్రామాను ఊహించని రేంజ్‌ లో తెరకెక్కించేందుకు దర్శకుడు సందీప్ ఒక పక్కా ఓ రేంజ్.. కాస్టింగ్‌ ను సెట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ నడుస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, ఒక సరికొత్త ఇంటెన్స్ వరల్డ్‌ ను క్రియేట్ చేయడంలో సిద్ధహస్తుడైన సందీప్, ఈ సినిమా కోసం నటీనటుల ఎంపికపై స్పెషల్ ఫోకస్ పెట్టాడు.

Also Read : భారత మార్కెట్లోకి సరికొత్త రేస్ బైక్..!

కేవలం కథతోనే కాకుండా, స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా కూడా ప్రేక్షకులను థ్రిల్ చేయడమే లక్ష్యంగా భారీ ప్లాన్ సిద్ధం చేశాడు. ఈ పవర్‌ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్‌ లో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, టాలెంటెడ్ యాక్టర్ ప్రకాశ్‌ రాజ్ వంటి విలక్షణ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ ట్రిప్తి డిమ్రీ కథానాయికగా నటిస్తుండగా, సీనియర్ నటి కాంచన కూడా ఒక ముఖ్య పాత్రకు ఎంపికయ్యారు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ఒక పవర్‌ ఫుల్ కేమియో రోల్‌ లో మెరవబోతున్నాడనే అనే న్యూస్ లీక్ అయింది.

Also Read : దుమారం రేపుతున్న సీజేఐ వ్యాఖ్యలు.. ఎందుకిలా..!

కథలో అత్యంత కీలకమైన మలుపు తిరిగే సమయంలో రణబీర్ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుందని టాక్. ఈ చిత్రంలో ప్రభాస్ ఒక పవర్‌ ఫుల్, రూత్‌ లెస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. సందీప్ వంగ మార్క్ ఇంటెన్స్ మేకింగ్, దానికి తోడు ప్రభాస్ మాస్ ఇమేజ్ తోడవ్వడంతో ఈ పోలీస్ డ్రామా సరికొత్త బెంచ్‌ మార్క్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన సౌండ్ స్టోరీ గ్లింప్స్ సినిమాపై అంచనాలను డబుల్ చేసింది. భారీ బడ్జెట్‌ తో, అత్యున్నత సాంకేతిక విలువల మధ్య రూపుదిద్దుకుంటున్న స్పిరిట్ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 5, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మహిళా పోలీసు తీరు...

జరిగింది ఘోరం.. అత్యంత నీచమైన చర్య.....

కమ్మ నేతకు రాజ్యసభ..?...

ఏపీలో త్వరలో ఖాళీ కానున్న 4...

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం...

దేశంలోని గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను పూర్తిగా...

గోదావరి క్లీనింగ్‌ పై...

ఏపీ డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్...

దుమారం రేపుతున్న సీజేఐ...

ఆల్ ఇండియా సెంట్రల్ సర్వీసెస్‌కు చెందిన...

బండి ఫ్యూచర్ ప్లాన్...

తెలంగాణ బీజేపీలో ఫైర్ బ్రాండ్ నేతగా...

పోల్స్