Sunday, May 24, 2026 10:32 AM
Sunday, May 24, 2026 10:32 AM

బండి ఫ్యూచర్ ప్లాన్ ఏమిటీ..?

తెలంగాణ బీజేపీలో ఫైర్ బ్రాండ్ నేతగా గుర్తింపు పొందిన బండి సంజయ్ కుమార్ రాజకీయ భవిష్యత్తు ప్రస్తుతం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది. అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీకి నమ్మకస్తుడిగా, హిందుత్వ వాదాన్ని బలంగా వినిపించే నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పటికీ, ఇటీవలి పరిణామాలు ఆయన పదోన్నతి పై ప్రభావం చూపుతాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మోదీ 3.0 క్యాబినెట్‌లో ప్రస్తుతం సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్‌కు త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో క్యాబినెట్ ర్యాంక్ దక్కే అవకాశాలపై చర్చ జరుగుతోంది.

Also Read : మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్, కావ్యా మారన్ పెళ్లి..?

తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు ఆయన వేసిన పునాది, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో ఉన్న మాస్ ఇమేజ్ ఆయనకు పెద్ద ప్లస్‌గా భావిస్తున్నారు. సామాజిక సమీకరణాలు, రాజకీయ బలం, తెలంగాణలో బలమైన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతగా బండి సంజయ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. బీసీ ఓటు బ్యాంకును ఆకర్షించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తెలంగాణలో కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ వంటి నేతలతో సమతుల్యం చేయాలంటే కేంద్రంలో బండి సంజయ్ పాత్ర కీలకమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

అయితే బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన పోక్సో కేసు అంశం ఆయన రాజకీయ ప్రగతికి అడ్డంకిగా మారే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ సాధారణంగా క్రమశిక్షణ, నైతిక విలువలకు ప్రాధాన్యం ఇస్తుంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్‌కి పదోన్నతి ఇస్తే విమర్శలు రావచ్చని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ బీజేపీలో సమీకరణాలు మారుతున్నాయి. ఒకప్పుడు తెలంగాణ బీజేపీ అంటే బండి సంజయ్ అనే స్థాయిలో ఉన్న పరిస్థితి ఇప్పుడు మారుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈటల రాజేందర్ జాతీయ స్థాయిలో ప్రాధాన్యం పొందుతుండగా, రఘునందన్ రావు వంటి నేతలు కూడా పోటీలో ఉన్నారు.

Also Read : చంద్రబాబుకు తల నొప్పిగా గుంటూరు ఎమ్మెల్యేలు..!

బీజేపీలో ఒకటే ఫైనల్.. అదే హైకమాండ్ నిర్ణయం. కేంద్ర నాయకత్వం పనితీరుతో పాటు పరిపాలనా అనుభవానికి కూడా ప్రాధాన్యం ఇస్తోందని సమాచారం. దూకుడైన నాయకత్వంతో పాటు అడ్మినిస్ట్రేటివ్ సామర్థ్యం ఉన్న నేతలకే మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇవ్వాలనే అభిప్రాయం ఉన్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్ రాజకీయ భవిష్యత్తు ప్రస్తుతం ఒక కీలక దశలో ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సామాజిక సమీకరణాలు ఆయనకు అనుకూలమవుతాయా లేక వివాదాలు ఆయన ఎదుగుదలకు బ్రేక్ వేస్తాయా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. అయితే తెలంగాణ బీజేపీ క్యాడర్ మాత్రం బండి సంజయ్ వంటి మాస్ లీడర్ కేంద్రంలో కీలక పాత్రలో ఉండాలని ఆశిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బెజవాడ కాదు… ఇది...

రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయి.. మృగశిర...

బెజవాడ థార్ గొడవ...

విజయవాడ నడిరోడ్డుపై జరిగిన థార్ కార్ల...

బ్రేకింగ్: ఇద్దరు ఎమ్మెల్యేలకు...

జనసేన పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల...

ట్రంప్ పిచ్చి తట్టుకోలేకే...

అమెరికా రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం...

చంద్రబాబుతో ఏపీ బిజేపి...

ఏపీలో రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి....

ఇన్స్టంట్ ఫ్రెండ్ వర్సెస్...

ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం ఏపీలో...

పోల్స్