Tuesday, May 19, 2026 08:55 PM
Tuesday, May 19, 2026 08:55 PM

మార్కెట్లోకి బ్రెజా.. అదిరిపోయే ఫీచర్లతో ఎంట్రీ..!

భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ లలో ఒకటైన మారుతి సుజుకి బ్రెజా సరికొత్త ఫేస్‌ లిఫ్ట్ తో మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతోంది. ఢిల్లీ సమీపంలోని వెస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్‌ ప్రెస్‌ వేపై ఈ 2026 వెర్షన్ మారుతి బ్రెజా ఫేస్‌ లిఫ్ట్ మోడల్.. ఎమిషన్ టెస్టింగ్ పరికరాలతో టెస్ట్ డ్రైవ్ చేస్తూ తొలిసారిగా కెమెరాకు చిక్కింది. ఇంజిన్ విభాగంలో మారుతి సుజుకి ఒక మేజర్ అప్డేట్ ఇవ్వబోతోందని జాతీయ మీడియా పేర్కొంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బ్రెజాలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మాత్రమే అందుబాటులో ఉంది.

Also Read : భారత జనాభాపై ఫస్ట్ పోస్ట్ సంచలన కథనం..!

అయితే, రాబోయే కొత్త మోడల్లో హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్ వంటి కార్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు వీలుగా.. మారుతి ఫ్రాంక్స్ లో వాడే 1.0 లీటర్ బూస్టర్‌జెట్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ ను లేదా 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ చిన్న ఇంజిన్ ఆప్షన్స్ వల్ల సబ్-4 మీటర్ నిబంధనల ప్రకారం ట్యాక్స్ రేట్లు తగ్గి, కొన్ని వేరియంట్ల ధరలు కూడా తగ్గే వెసులుబాటు కలగనుంది. ఈ 2026 ఫేస్‌ లిఫ్ట్ మోడల్లో కస్టమర్లను ఆకట్టుకునేలా క్యాబిన్ లోపల ప్రధాన మార్పులు చేశారు.

Also Read : ముంబై హైకోర్ట్ లాయర్ పై రే*ప్.. మ్యాట్రిమొనియల్ సైట్ నమ్మి..!

ఇప్పటివరకు ఉన్న 9-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ స్థానంలో.. సరికొత్త పెద్ద 10.1 ఇంచ్ టచ్‌ స్క్రీన్ సిస్టమ్‌ ను అమర్చారు. అంతేకాకుండా, డ్రైవింగ్ అనుభూతిని మరింత మెరుగుపరచడానికి సరికొత్త 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌ బాక్స్ ను ఈ కార్లో తీసుకురాబోతున్నారు. కొత్త క్యాబిన్ కలర్స్, అప్డేటెడ్ ట్రిమ్స్‌ తో కారు లోపలి భాగం మరింత ప్రీమియంగా కనిపించనుంది. కారు వెలుపలి డిజైన్ లో పెద్దగా మార్పులు చేయనప్పటికీ, ఫ్రంట్ గ్రిల్ మరియు బంపర్ లుక్‌ ను మరింత స్టైలిష్‌ గా మార్చారు. ముఖ్యంగా ఫ్రంట్ గ్రిల్ మధ్యలో అమర్చిన రాడార్ హౌసింగ్ చూస్తుంటే, బ్రెజా చరిత్రలోనే మొదటిసారిగా ADAS సేఫ్టీ ఫీచర్‌ను పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది పండుగ సీజన్ లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సరికొత్త బ్రెజా ఫేస్‌ లిఫ్ట్ మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

టీ బీజేపీలో భారీ...

తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన బండి...

కేంద్రానికి విజయ్ బిగ్...

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ...

ముందస్తు ఎన్నికలకు రెడీ...

తమిళనాడు రాజకీయాలు మరోసారి సంచలనంగా మారాయి....

ముంబై హైకోర్ట్ లాయర్...

దేశంలో మహిళల భద్రతపై ఇటీవలి కాలంలో...

నీట్‌ పరీక్షపై కేంద్రం...

నీట్ యూజీ 2026 పేపర్ లీక్‌పై...

అవును.. వాళ్లిద్దరు కలిశారు.....

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు.. అలాగని.....

పోల్స్