Saturday, May 16, 2026 08:36 PM
Saturday, May 16, 2026 08:36 PM

2027 వరల్డ్ కప్ ఆడాలంటే కండిషన్స్ అప్లై..!

భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ తన వన్డే కెరీర్ భవిష్యత్తుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అధికారిక పాడ్‌ కాస్ట్‌ లో అతను మాట్లాడుతూ.. 2027 వన్డే ప్రపంచకప్‌ లో తన భాగస్వామ్యంపై బీసీసీఐ, సెలెక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్‌ కు తాను ఏం చెప్పాలనుకునేది చెప్పేసాడు. ప్రస్తుతం 37 ఏళ్ల వయసులో ఉన్న కోహ్లీ, తాను ప్రతి సిరీస్‌ లోనూ జట్టులో తన స్థానాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని, అలాంటి పరిస్థితిలో తాను ఉండదలుచుకోలేదని స్పష్టం చేసాడు.

Also Read : భూమన ఫ్యామిలీకి షాక్.. హడావుడి తగ్గుతుందా..?

తాను.. జట్టుకు సరిపోనని భావిస్తే లేదా తన అవసరం లేదని అనుకుంటే.. ఆ విషయాన్ని మొదటి రోజే నాకు ముఖం మీదే స్పష్టంగా చెప్పేయండి. అంతేగానీ, నేను ప్రతిసారీ నా విలువను, నా అర్హతను నిరూపించుకోవాలని ఒత్తిడి తెస్తే మాత్రం నేను ఆ స్థానంలో కొనసాగలేను అంటూ కోహ్లీ అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేసాడు. తనను ప్రతి సిరీస్‌ కు విడివిడిగా కాకుండా, 2027 ప్రపంచకప్ వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా జట్టులో ఒక నిర్దిష్టమైన రోల్‌ ను కేటాయించాలని అతను పరోక్షంగా డిమాండ్ చేశాడు.

Also Read : ప్లేఆఫ్స్ రేసును చెడగొడుతున్న ముంబై, లక్నో..!

ఇప్పటికే అంతర్జాతీయ టీ20లు, టెస్ట్ క్రికెట్ నుండి వైదొలిగి కేవలం 50 ఓవర్ల ఫార్మాట్‌ కే పరిమితమైన కోహ్లీని మేనేజ్ చేయడం ఇప్పుడు బీసీసీఐకి ఒక పెద్ద సవాల్‌ గా మారింది. తన ఫిట్నెస్ గురించి మాట్లాడుతూ.. మైదానంలో 40 ఓవర్ల పాటు ఎలాంటి అలసట లేకుండా బౌండరీ లైన్ వెంట పరిగెత్తే సత్తా తనకు ఉందని, కాబట్టి తనను జట్టు నుండి పక్కన పెట్టడానికి వర్క్‌ లోడ్ లేదా ఫిట్నెస్ అనే సాకులను వెతకలేరని కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. గత ఏడాది వన్డేల్లో 65 సగటుతో 3 సెంచరీలతో పాటు 651 పరుగులు చేసిన అతను, ఈ ఏడాది కూడా ఇప్పటికే ఒక సెంచరీ సాధించి అద్భుతమైన ఫామ్‌ లో కొనసాగుతున్నాడు. సీనియర్ ఆటగాళ్లను సిరీస్ ల వారీగా అంచనా వేసే బీసీసీఐ ప్రస్తుత సెలెక్షన్ పాలసీని కోహ్లీ తన అల్టిమేటంతో పూర్తిగా తిరస్కరించినట్లయిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నాడు రాళ్ళ సీమ.....

రాయలసీమ ప్రాంతాన్ని నిజమైన రతనాల సీమగా...

అన్నకు కౌంటర్‌గా షర్మిల...

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల పాదయాత్రకు...

భూమన ఫ్యామిలీకి షాక్.....

ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే...

రఘురామ వర్సెస్ కొలికపూడి...

గత కొన్నాళ్ళుగా తిరువూరు నియోజకవర్గం ఏపీ...

నేడే బండి భగీరథ్...

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి...

పవన్ అడ్డా అదేనా.....

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా పాతుకు...

పోల్స్