టాలీవుడ్ స్టార్ హీరో.. మహేష్ బాబు గతంలో చేసిన “బాలీవుడ్ నన్ను భరించలేదు” అనే వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ నటుడు రాహుల్ దేవ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మహేష్ బాబు హిందీ సినిమాల్లో నటించకపోవడానికి గల అసలు కారణాన్ని బయటపెట్టాడు. భాషా సమస్యే ఆయన బాలీవుడ్ కు దూరం కావడానికి ప్రధాన కారణం కావచ్చునని రాహుల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. ఒక హిందీ ఇంటర్వ్యూలో రాహుల్ దేవ్ మాట్లాడుతూ, టక్కరి దొంగ సినిమాలో మహేష్ బాబుతో కలిసి పనిచేసిన అనుభవాలను పంచుకున్నాడు.
Also Read : చిలుకూరు బాలాజీ టెంపుల్ పై అమెరికా ఏడుపులు..!
మహేష్ బాబుకు హిందీ భాషపై అంతగా పట్టు లేదని, ఆయనకు హిందీ సరిగ్గా రాదు, నిజం చెప్పాలంటే అదే అసలు విషయం అంటూ రాహుల్ దేవ్ క్లారిటీ ఇచ్చాడు. డబ్బింగ్ సినిమాల ద్వారా దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్నప్పటికీ, మహేష్ బాబు బాలీవుడ్ వైపు ఎందుకు అడుగులు వేయలేదనే దానిపై ఎప్పటి నుంచో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. టాలీవుడ్ లో మహేష్ బాబు సినిమా సెలెక్షన్ పై రాహుల్ దేవ్ ప్రశంసించాడు. ముఖ్యంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఆయన చేసిన సినిమాలు తెలుగు ప్రేక్షకులతో బలమైన బంధాన్ని ఏర్పరిచాయని పేర్కొన్నాడు.
Also Read : మహానాడుపై టీడీపీ సంచలన నిర్ణయం..!
బాలీవుడ్‌లో కమర్షియల్ రీమేక్ లు లేదా ప్రయోగాత్మక సినిమాల మధ్య సమతుల్యత లోపించిందని, కానీ తెలుగు సినిమా పరిశ్రమ కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి కథలను అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తోందని చెప్పుకొచ్చాడు. గతంలో మేజర్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మహేష్ బాబు మాట్లాడుతూ.. తనకు హిందీలో అనేక అవకాశాలు వచ్చాయని, అయితే అక్కడి నిర్మాతలు తన ఆర్థిక అంచనాలను అందుకోలేకపోయారని కామెంట్ చేయడం సంచలనం అయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే తనకు లభిస్తున్న గౌరవం, స్టార్ డమ్ దృష్ట్యా తాను వేరే పరిశ్రమల వైపు చూడాల్సిన అవసరం లేదని మహేష్ అప్పట్లో చేసిన కామెంట్స్ పై పెద్ద చర్చే నడిచింది.

