Wednesday, August 12, 2026 06:55 AM
Wednesday, August 12, 2026 06:55 AM

సీమకు రాయల్ కళ.. పుట్టపర్తిలో AMCA గర్జన..!

పారిశ్రామిక అభివృద్ధిలో ఏపీ దూసుకెళ్తోంది. కొంతకాలంగా భారీ పెట్టుబడులు ఒక్కొక్కటిగా రాయలసీమలో అడుగుపెడుతున్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్ దిగ్గజం రాయల్ ఎన్‌ఫీల్డ్ రాకతో సీమ రూపురేఖలు మారబోతుండగా, మరోవైపు పుట్టపర్తి వేదికగా దేశ రక్షణ రంగంలోనే అత్యంత కీలకమైన AMCA ప్రాజెక్టుకు అడుగులు పడుతుండటం సంచలనంగా మారింది.

రాయలసీమను ఆటోమొబైల్ హబ్‌గా మార్చాలన్న లక్ష్యం దిశగా ప్రభుత్వం వేస్తున్న అడుగులు సత్ఫలితాలనిస్తున్నాయి. కియా మోటార్స్ సృష్టించిన ప్రకంపనల తర్వాత, ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ప్లాంట్‌ను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. వందల కోట్ల పెట్టుబడితో పాటు వేల సంఖ్యలో స్థానిక యువతకు ఉపాధి లభించనుంది. కేవలం ఒక కంపెనీగానే కాకుండా, దీని అనుబంధ సంస్థలు కూడా సీమకు తరలిరానుండటంతో ఈ ప్రాంతం పారిశ్రామికంగా మరో మెట్టు ఎక్కబోతోంది.

Also Read : లోకేష్ ట్వీట్స్ కు ఇంటర్నేషనల్ క్రేజ్.. ఇండస్ట్రీ వర్గాల్లో ఎందుకీ చర్చ..?

ఆధ్యాత్మిక నగరంగా గుర్తింపు పొందిన పుట్టపర్తి, త్వరలో దేశ రక్షణ మ్యాప్‌లో చోటు సంపాదించుకోబోతోంది. ఫిఫ్త్‌ జనరేషన్ యుద్ధ విమానాల తయారీకి సంబంధించి అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ – AMCA ప్రాజెక్టు ఫౌండేషన్ సెర్మనీకి రంగం సిద్ధమవుతోంది. పుట్టపర్తి సమీపంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు పూర్తి చేశాయి. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే, ఏరోస్పేస్ రంగంలో ఏపీ దేశానికే తలమానికంగా మారుతుందనడంలో సందేహం లేదు.

ఒకప్పుడు కరువు ప్రాంతంగా ముద్రపడిన రాయలసీమ, ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ, హైటెక్ పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి గ్లోబల్ బ్రాండ్స్ రాకతో పాటు, రక్షణ రంగ ప్రాజెక్టులు ఇక్కడి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, కనెక్టివిటీ సౌలభ్యం కారణంగా అటు బెంగళూరు, ఇటు చెన్నై పారిశ్రామిక కారిడార్లకు రాయలసీమ వారధిగా మారుతోంది.

Also Read : పొదుపు మొదలుపెట్టిన మోడీ.. కీలక నిర్ణయాలు..!

పుట్టపర్తిలో జరగబోయే AMCA శంకుస్థాపన వేడుకకు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులతో పాటు పారిశ్రామిక దిగ్గజాలు హాజరయ్యే అవకాశం ఉంది. బ్యాక్-టు-బ్యాక్ పరిణామాలు చూస్తుంటే, రాబోయే ఐదేళ్లలో రాయలసీమలో పారిశ్రామిక విప్లవం ఖాయమంటున్నారు విశ్లేషకులు . కియా తెచ్చిన క్రేజ్ కంటే ఇప్పుడు రాబోతున్న పెట్టుబడులు ఈ ప్రాంత రూపురేఖలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దనున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఢిల్లీ వేదికగా మళ్లీ...

రాష్ట్రంలో ప్రగల్భాలు పలికే వైకాపా అధినేత...

బాలినేని – దామచర్ల...

ఒంగోలు నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా...

మార్కాపురం జిల్లాకు కూటమి...

కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా వాసులు...

జూలకంటిని ఇరికించాలని చూసిన...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పల్నాడు జిల్లా కేంద్రంగా...

సోషల్ మీడియా సైకోలపై...

సోషల్ మీడియా వేదికగా మహిళలు, కుటుంబ...

విశాఖకు రెడ్ అలెర్ట్.....

విశాఖపట్నం దేశంలోని టైర్ టూ మెగా...

పోల్స్