Saturday, June 27, 2026 04:44 PM
Saturday, June 27, 2026 04:44 PM

విజయ్ కు మొదలైన చిక్కులు.. మిత్రపక్షాల షాకింగ్ కామెంట్స్..!

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్తగా అడుగుపెట్టి, సంచలన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్న.. సిఎం విజయ్ అప్పుడే ప్రభుత్వంలో చుక్కలు చూస్తున్నారు. తన పార్టీ అధికారిక కార్యకలాపాలను నిర్వహించడానికి, పరిపాలనను పర్యవేక్షించడానికి ఒక జ్యోతిష్కుడిని ఓఎస్డీగా విజయ్ నియమించుకున్నారనే వార్త ఇప్పుడు తమిళనాడులో తీవ్ర సంచలనంగా మారింది. ఈ నిర్ణయంపై రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన విడుతలై చిరుతైగల్ కట్చి, దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ విమర్శలు మొదలుపెట్టాయి.

Also Read : మోదీ పొదుపు సలహాల వెనుక అసలు లెక్క ఇదే..!

ప్రభుత్వ పాలనలో, కీలక నిర్ణయాల్లో జ్యోతిష్కులను భాగస్వామ్యం చేయడంపై వీసీకే పార్టీ ఎమ్మెల్యేలు విజయ్‌ కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఆధునిక కాలంలో ప్రజాప్రతినిధులు శాస్త్రీయమైన ఆలోచనా విధానంపై దృష్టి పెట్టాలి తప్ప, ఇలాంటి జ్యోతిష్యాన్ని నమ్ముకుని పరిపాలన సాగించకూడదని హితవు పలికారు. సమాజంలో మూఢనమ్మకాలను ప్రోత్సహించేలా ఇలాంటి నియామకాలు ఉండటం సరైన పద్ధతి కాదని, ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా విజయ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Also Read : అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపులో వాస్తవాలు ఇవే..!

మరోవైపు ఎమ్మెల్యే ప్రేమలత విజయ్‌ కాంత్ కూడా ఈ నియామకంపై ఘాటుగా స్పందించారు. మార్పు కోరుకుంటూ విజయ్ వైపు చూసిన లక్షలాది మంది యువత ఓట్లతో ఆయన ఈ స్థాయికి వచ్చారని, యువత నమ్మకాన్ని జ్యోతిష్కుల చేతుల్లో పెట్టడం సరికాదని ఆమె వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, పార్టీకి సంబంధించిన అత్యంత కీలకమైన పదవుల్లోకి ఇలాంటి వ్యక్తులను తీసుకురావడం వల్ల భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. విజయ్ అధికారంలోకి రాకముందే ఇలాంటి వివాదాలు మరియు విమర్శలు చుట్టుముట్టడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏపీ పోలీసులపై మానవ...

ఏపీలో సంచలనం సృష్టించిన యువకుడు సాయికృష్ణ...

తెలంగాణా సర్కార్ కు...

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో ఒక...

ఏపీ మ్యాప్ తో...

ఏపీలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో...

చివరి రోజుల్లో శ్రీలక్ష్మికి...

ఎట్టికేలకు సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారిణి...

ఆ ఇద్దరు హెడ్...

విజయవాడలో పెను సంచలనం సృష్టించిన గాదె...

సంచలన నిర్ణయం దిశగా...

ఏపీ విద్యాశాఖలో విప్లవాత్మక మార్పుల దిశగా...

పోల్స్