Tuesday, May 12, 2026 06:08 PM
Tuesday, May 12, 2026 06:08 PM

అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపులో వాస్తవాలు ఇవే..!

రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు జరగలేదంటూ వస్తున్న ఆరోపణలను అధికారిక గణాంకాలు పటాపంచలు చేస్తున్నాయి. భూ సమీకరణలో పాల్గొన్న మెజారిటీ రైతులకు ఇప్పటికే ప్లాట్ల కేటాయింపుతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా దాదాపు కొలిక్కి వచ్చింది. తాజాగా విడుదలైన లెక్కల ప్రకారం, సుమారు 97 శాతం మంది రైతులకు ఇప్పటికే ప్లాట్ల పంపిణీ పూర్తయింది. కేవలం న్యాయపరమైన చిక్కులు మరియు సాంకేతిక కారణాల వల్ల పెండింగ్‌లో ఉన్న అతి తక్కువ శాతాన్ని సాకుగా చూపి విమర్శలు చేయడం సరికాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రాజధాని కోసం భూములిచ్చిన మొత్తం 30,753 మంది రైతులకు గానూ, ఇప్పటికే 30,079 మందికి అంటే 97% ప్లాట్లు కేటాయించే ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. కేవలం 674 మంది రైతులకు మాత్రమే ప్లాట్లు కేటాయించాల్సి ఉంది. విస్తీర్ణం పరంగా చూస్తే, మొత్తం పూల్ అయిన 35,017 ఎకరాలలో 34,527 ఎకరాలకు అంటే.. 98.6% సంబంధించి ప్లాట్ల కేటాయింపు పూర్తయింది. అంటే కేవలం 1.4 శాతం భూమి అంటే.. 489 ఎకరాలు మాత్రమే ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. దీనిని బట్టి ప్రభుత్వం ఎంత వేగంగా రైతుల ప్రయోజనాల కోసం పనిచేస్తుందో స్పష్టమవుతోంది.

Also Read :గేమ్ ఆడుతున్న పాక్.. అమెరికా చేతిలో షాక్ తప్పదా..?

కేవలం ప్లాట్లు కేటాయించడమే కాకుండా, వాటిని రైతుల పేరిట రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ కూడా యుద్ధ ప్రాతిపదికన సాగుతోంది. మొత్తం కేటాయించిన 70,824 ప్లాట్లలో ఇప్పటివరకు 63,295 ప్లాట్లు అంటే 89.3% రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నాయి. మిగిలిన 7,529 ప్లాట్ల రిజిస్ట్రేషన్ పెండింగ్‌లో ఉండటానికి ప్రధానంగా యజమానులు అందుబాటులో లేకపోవడం, కుటుంబ వివాదాలు మరియు న్యాయపరమైన చిక్కులే కారణమని ప్రభుత్వం వెల్లడించింది. లంక భూముల విషయంలో కూడా సానుకూల ప్రగతి కనిపిస్తోంది. మొత్తం 356 లంక భూముల ప్లాట్లలో ఇప్పటికే 147 ప్లాట్లు రిజిస్టర్ అయ్యాయి.

ప్లాట్ల కేటాయింపు మరియు రిజిస్ట్రేషన్లు వంద శాతం పూర్తి కాకపోవడానికి గల సహేతుకమైన కారణాలను ప్రభుత్వం పారదర్శకంగా వెల్లడించింది. సుమారు 65 మంది రైతులకు సంబంధించిన 111 ఎకరాలు కోర్టు కేసుల వల్ల నిలిచిపోయాయని ప్రభుత్వం వివరించింది. కేటగిరీ 4 మరియు లంక భూముల నివేదికలు ప్రస్తుతం కలెక్టర్ కార్యాలయం వద్ద పరిశీలనలో ఉండటం వల్ల సుమారు 164 ఎకరాల కేటాయింపు ఆగిందని ప్రభుత్వం వివరించింది. కుటుంబ మరియు వారసత్వ సమస్యలు కూడా ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది.

Also Read :బ్రేకింగ్: బిజేపికి షాక్ ఇచ్చిన అన్నాడిఎంకే..!

భూ యజమానులు మరణించడం, వారసుల మధ్య సయోధ్య లేకపోవడం లేదా ఫ్యామిలీ సర్టిఫికెట్లు అందుబాటులో లేకపోవడం వంటి కారణాల వల్ల సుమారు 1,200 పైగా ప్లాట్లు రిజిస్ట్రేషన్ కాకుండా ఉండిపోయాయని ప్రభుత్వం తెలిపింది. అలాగే ఎన్నారైలు మరియు ఇతర ప్రాంతాల వారికి కూడా ప్లాట్ లు ఇవ్వాల్సి ఉందని, ప్లాట్లు పొందిన సుమారు 361 మంది రైతులు రాష్ట్రంలో లేదా దేశంలో అందుబాటులో లేకపోవడం వల్ల ఆ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయిందని ప్రభుత్వం వివరించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఆంధ్ర న్యూస్ 9...

మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి...

ప్రసంగించడానికి వెళ్లి పెట్టుబడులతో...

అమరావతి బ్రాండ్ ఇమేజ్‌ను ప్రపంచ స్థాయికి...

బ్రేకింగ్: నాగార్జున యాదవ్...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్...

పోలవరం పనులపై మళ్ళీ...

పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో తెలుగు...

బ్రేకింగ్: బిజేపికి షాక్...

బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నుండి...

అర్ధరాత్రి హైడ్రామా.. అనుకున్నది...

నేషనల్ హైవే-16పై రోడ్ల దుస్థితికి నిరసనగా...

పోల్స్