Wednesday, August 12, 2026 10:24 AM
Wednesday, August 12, 2026 10:24 AM

పెద్ది క్లైమాక్స్ లో మెగా విశ్వరూపమే.. ఫ్యాన్స్ కు పూనకాలు..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం పెద్ది. ఈ సినిమా గురించి టాప్ సినిమాటోగ్రాఫర్ ఆర్. రత్నవేలు తాజాగా పంచుకున్న విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చరణ్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, అతని నటన గురించి రత్నవేలు చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర కోసం విపరీతమైన కష్టపడ్డారని రత్నవేలు తెలిపారు. చరణ్ ఈ మూవీలో రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తారని పేర్కొన్నారు.

Also Read : రోజా అరెస్టుకు ఐఏఎస్ బ్రేకులు..!

ఒకటి క్రికెటర్ కాగా, మరొకటి మల్లయోధుడి పాత్ర అని వివరించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. చరణ్ అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న సమయంలోనే ఈ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నారట. కేవలం శాకాహార భోజనం తీసుకుంటూనే, చాలా తక్కువ సమయంలో మల్లయోధుడికి కావాల్సిన ఫిజిక్‌ ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారని ఆయన చెప్పుకొచ్చారు. కేవలం లుక్ పరంగానే కాకుండా, నటనలోనూ చరణ్ మరో మెట్టు ఎక్కారని రత్నవేలు ప్రశంసించారు.

Also Read : అర్ధరాత్రి హైడ్రామా.. అనుకున్నది సాధించిన చింతమనేని..!

ఒక సీన్ చేస్తున్నప్పుడు చరణ్ నటన చూసి నేను షాక్ అయ్యాను. ఆయన పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. ఈ సినిమాతో చరణ్ తనలోని మరో కోణాన్ని ప్రపంచానికి చూపిస్తారు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ కెరీర్‌ లో రంగస్థలం ఎంతటి ప్రభావాన్ని చూపిందో, ఈ పెద్ది అంతకు మించి ఉంటుందని ఇండస్ట్రీ టాక్. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామా కోసం బుచ్చిబాబు రెండేళ్ల పాటు స్క్రిప్ట్ మీద వర్క్ చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఢిల్లీ వేదికగా మళ్లీ...

రాష్ట్రంలో ప్రగల్భాలు పలికే వైకాపా అధినేత...

బాలినేని – దామచర్ల...

ఒంగోలు నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా...

మార్కాపురం జిల్లాకు కూటమి...

కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా వాసులు...

జూలకంటిని ఇరికించాలని చూసిన...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పల్నాడు జిల్లా కేంద్రంగా...

సోషల్ మీడియా సైకోలపై...

సోషల్ మీడియా వేదికగా మహిళలు, కుటుంబ...

విశాఖకు రెడ్ అలెర్ట్.....

విశాఖపట్నం దేశంలోని టైర్ టూ మెగా...

పోల్స్