Saturday, June 27, 2026 07:30 AM
Saturday, June 27, 2026 07:30 AM

దళపతి జననాయగన్ రిలీజ్ పై క్రేజీ అప్డేట్..!

తమిళ చిత్ర పరిశ్రమలో తిరుగులేని స్టార్‌ డమ్ సంపాదించుకున్న దళపతి విజయ్, ఇప్పుడు రాజకీయాల్లోనూ సత్తా చాటారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించి, ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ చారిత్రాత్మక ఘట్టం విజయ్ అభిమానుల్లో పండగ వాతావరణం నింపగా, అదే సమయంలో ఆయన నటించిన చివరి సినిమా జననాయగన్ విడుదల కోసం వారు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ అప్డేట్ బయటకు వచ్చింది.

Also Read : జగన్ స్కెచ్ వర్కవుట్ అవుతుందా..?

ఈ కార్యక్రమానికి హాజరైన జననాయగన్ చిత్ర నిర్మాత కె. వెంకట్ నారాయణ మీడియాతో మాట్లాడుతూ సినిమా విడుదల తేదీపై స్పష్టత ఇచ్చారు. గత కొంతకాలంగా సెన్సార్ బోర్డు అభ్యంతరాలు, న్యాయపరమైన చిక్కుల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం, ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైందని ఆయన ప్రకటించారు. సెన్సార్ బోర్డు నుంచి త్వరలోనే క్లియరెన్స్ వస్తుందని భావిస్తున్నామని, సర్టిఫికేట్ అందిన రెండు వారాల్లోపే సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని నిర్మాత స్పష్టం చేసారు.

Also Read : ఐఫోన్ చిప్స్ ఇక ఇంటెల్ మేకింగ్..?

మే నెలలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, మే నెలాఖరులోపు విజయ్ చివరి సినిమా వెండితెరపై సందడి చేయనుంది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహించారు. విజయ్ తన సినీ కెరీర్‌ లో 69వ, చివరి సినిమాగా దీనిని ప్రకటించడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఆయన నిజ జీవితంలో కూడా ముఖ్యమంత్రి కావడంతో, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

చివరి రోజుల్లో శ్రీలక్ష్మికి...

ఎట్టికేలకు సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారిణి...

ఆ ఇద్దరు హెడ్...

విజయవాడలో పెను సంచలనం సృష్టించిన గాదె...

సంచలన నిర్ణయం దిశగా...

ఏపీ విద్యాశాఖలో విప్లవాత్మక మార్పుల దిశగా...

సింగిల్‌గా పోరాడుతున్న జనసేనాని..!

"నేనొక్కడినే మాట్లాడాలా..? మీ గొంతులు ఎందుకు...

నదుల అనుసంధానంతో భారత్...

కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్...

పాస్‌పోర్ట్ జాతీయత కాదా..?...

భారతీయ పాస్‌పోర్ట్ అనేది కేవలం ఒక...

పోల్స్