Saturday, June 27, 2026 04:28 AM
Saturday, June 27, 2026 04:28 AM

మే 15 నుంచి చమురు మోత.. గెట్ రెడీ..

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, హోర్ముజ్ జలసంధిలో తలెత్తిన అంతరాయాల కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బ్యారెల్ ముడిచమురు ధర 70 డాలర్ల నుండి ఏకంగా 120 డాలర్లు దాటేసింది. దీంతో భారత చమురు మార్కెటింగ్ కంపెనీలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. ఈ క్రమంలో మే 15 లోపు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వరంగ చమురు సంస్థలు నెలకు దాదాపు రూ.30,000 కోట్ల మేర నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.4 నుండి రూ.5 వరకు, అలాగే డొమెస్టిక్ ఎల్‍‌పీజీ సిలిండర్‌పై రూ.40 నుండి రూ.50 వరకు ధర పెరిగే సూచనలు ఉన్నాయి.

Also Read : ఢిల్లీలో బిజీ బిజీగా చంద్రబాబు..!

మరోవైపు, సంక్షోభం ఎదురైనప్పటికీ భారత్ తన ఇంధన భద్రతను పటిష్టం చేసుకుంది. రష్యా, అమెరికా వంటి దేశాల నుండి చమురు దిగుమతులను పెంచడంతో పాటు, దేశీయ ఎల్‌పీజీ ఉత్పత్తిని రోజుకు 36 వేల టన్నుల నుండి 54 వేల టన్నులకు పెంచింది. ఇథనాల్ బ్లెండింగ్‌ను కూడా 1.5 శాతం నుండి 20 శాతానికి పెంచడం ద్వారా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. అయినప్పటికీ, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సద్దుమణగకపోవడంతో ధరల సవరణ అనివార్యమని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పెంపు అమలైతే 2022 తర్వాత జరుగుతున్న అతిపెద్ద ధరల మార్పు ఇదే కానుంది.

Also Read : రోజా అరెస్టుకు ఐఏఎస్ బ్రేకులు..!

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయినా కూడా భారత్‌లో మాత్రం ఎక్సెజ్ సుంకాన్ని సుమారు రూ.10 మేర తగ్గించి, రష్యా వంటి ఇతర దేశాల నుండి ముడిచమురు దిగుమతులను పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ధరలను నియంత్రిస్తూ వచ్చింది. ప్రస్తుతం కంపెనీలు పెట్రోల్‌పై లీటరుకు రూ.14, డీజిల్‌పై రూ.18 మేర నష్టాన్ని భరిస్తున్నాయని. అంతర్జాతీయ ఒత్తిడి నేపథ్యంలో ఈ ధరల సవరణ అనివార్యమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ ఈ పెంపు అమలైతే, గత నాలుగేళ్లలో చోటుచేసుకున్న అతి పెద్ద ధరల మార్పుగా ఇది నిలవనుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

చివరి రోజుల్లో శ్రీలక్ష్మికి...

ఎట్టికేలకు సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారిణి...

ఆ ఇద్దరు హెడ్...

విజయవాడలో పెను సంచలనం సృష్టించిన గాదె...

సంచలన నిర్ణయం దిశగా...

ఏపీ విద్యాశాఖలో విప్లవాత్మక మార్పుల దిశగా...

సింగిల్‌గా పోరాడుతున్న జనసేనాని..!

"నేనొక్కడినే మాట్లాడాలా..? మీ గొంతులు ఎందుకు...

నదుల అనుసంధానంతో భారత్...

కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్...

పాస్‌పోర్ట్ జాతీయత కాదా..?...

భారతీయ పాస్‌పోర్ట్ అనేది కేవలం ఒక...

పోల్స్