Wednesday, September 23, 2026 10:21 AM
Wednesday, September 23, 2026 10:21 AM

జగన్ స్కెచ్ వర్కవుట్ అవుతుందా..?

2029లో అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ వర్గాల సమాచారం మేరకు ఎన్నికలకు ముందే అభ్యర్థులను ప్రకటించాలని జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. తన పాదయాత్రకు ముందే అత్యధిక స్థానాల్లో అభ్యర్థులను అనధికారికంగా ఖరారు చేయాలన్న యోచనలో ఉన్నారు. దీనివల్ల అభ్యర్థులు ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలకు చేరువయ్యే అవకాశాలుంటాయని, క్యాడర్ తో కూడా సత్సంబంధాలు నెలకొల్పి బూత్ లెవల్ కమిటీలను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు. 2027లో తన పాదయాత్ర ఉంటుందని జగన్ ఇప్పటికే ప్రకటించారు. అంటే రెండేళ్లకు ముందే అభ్యర్థులను ఖరారు చేయాలన్న యోచనలో జగన్ ఉన్నారు.

Also Read : అసలు విజయ్ చుట్టూ ఏమి జరుగుతుంది..? బలం లేకున్నా రాజ్ భవన్‌ కు ఎందుకు..?

ఇప్పటికే నియోజకవర్గాల వారీగా నేతల జాబితాను ఒక టీం సేకరిస్తున్నట్లు చెబుతున్నారు. జగన్ లండన్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత జాబితాను సమర్పించనున్నారని తెలిసింది. ఎన్నికల వ్యూహకర్తలు చెప్పిన మేరకు ఖారారు చేసిన అభ్యర్థులు ఖచ్చితంగా పాటించాలని, సోషల్ మీడియాలో స్థానిక సమస్యలపై యాక్టివ్‌గా ఉండేందుకు రెండేళ్ల కాలం సరిపోతుందని, కూటమి ప్రభుత్వ వైఫల్యాలతో పాటు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు జరిగిన మేలు ఏంటన్నది తెలియజేస్తూ పెద్దయెత్తున ప్రచారం చేయాలని నిర్ణయించారు. అందుకే ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే ప్లాన్ జగన్ సిద్ధం చేసుకుంటున్నారు.

Also Read : వాజపేయి కోరిక తీర్చిన మోడీషా..!

పాదయాత్ర సమయంలో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను పరిచయం చేస్తే మరింత బాగుంటుందని కూడా జగన్ యోచిస్తున్నారని తెలిసింది. అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోకపోయినా జగన్ పక్కన వారికి చోటును కల్పిస్తే పరోక్షంగా అభ్యర్థిని ప్రకటించే అవకాశముంటుందన్న భావన కూడా వినపడుతుంది. అయితే అన్ని స్థానాల్లో కాకపోయినా మెజారిటీ స్థానాలకు మాత్రం అభ్యర్థులను ముందుగానే ప్రకటించి ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని జగన్ ప్లాన్ వేస్తున్నారని తెలిసింది. మరి దీనివల్ల పార్టీలో ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశాలున్నాయి. ఆశావహులు టిక్కెట్లు ఖరారు చేస్తే పార్టీని వీడే అవకాశముందని, అందుకే కొన్ని కీలక నియోజకవర్గాల్లోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని పార్టీ సినియర్ నేత వ్యాఖ్యానించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అమరావతికి క్యూ కడుతున్న...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి...

టీచర్లపై దాడిలో అరాచక...

విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్...

జగన్‌కు ఊహించని షాక్...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

టాలీవుడ్ కు ఏపీ...

తెలుగు చలనచిత్ర మరియు టెలివిజన్ రంగాలకు...

తప్పు చేసి కొత్త...

బెజవాడలో టీచర్లపై చేసిన దాడిని, తాము...

కూతురు పెళ్లిని అడ్డుపెట్టుకుని...

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా...

పోల్స్