Saturday, May 9, 2026 05:00 PM
Saturday, May 9, 2026 05:00 PM

అసలు విజయ్ చుట్టూ ఏమి జరుగుతుంది..? బలం లేకున్నా రాజ్ భవన్‌ కు ఎందుకు..?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మార్కును అందుకోలేకపోయింది. అయినప్పటికీ విజయ్ పదే పదే గవర్నర్‌ ను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సాధారణంగా సంఖ్యాబలం లేని పక్షంలో ఏ నేత అయినా ఇతర పార్టీల మద్దతు కోసం వేచి చూస్తారు. కానీ విజయ్ మాత్రం వరుసగా రాజ్ భవన్‌ మెట్లు ఎక్కడం వెనుక ప్రధానంగా సైకలాజికల్ డామినెన్స్ వ్యూహం కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.

Also Read : ఇద్దరు సీఎంల ముద్దుల ఐఏఎస్ అధికారి..!

తాను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నానని, మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని ప్రజల్లోకి బలంగా పంపడం ద్వారా ప్రత్యర్థి పార్టీలైన అన్నాడీఎంకే, బీజేపీలను ఆత్మరక్షణలో పడేయడం ఆయన మొదటి వ్యూహం అనే మాట వినపడుతోంది. విజయ్ ఇంత ధైర్యంగా అడుగులు వేయడం వెనుక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మాజీ సీఎం స్టాలిన్ వ్యూహాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. అధికారికంగా కాంగ్రెస్ తన 5 మంది ఎమ్మెల్యేల మద్దతును విజయ్‌ కు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక తెరవెనుక డీఎంకే మిత్రపక్షాలైన లెఫ్ట్ పార్టీలు, వీసీకేలు కూడా విజయ్‌ కు జై కొట్టాయి. స్టాలిన్ నేరుగా మద్దతు ఇస్తే క్యాడర్‌ లో ఇబ్బందులు వస్తాయని భావించి, తన మిత్రపక్షాల ద్వారా విజయ్‌కు అవసరమైన సంఖ్యాబలాన్ని అందిస్తున్నారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అన్నాడీఎంకే మళ్లీ పుంజుకోకుండా చూడటం, బీజేపీని రాష్ట్రంలో అడుగు పెట్టకుండా చేయడమే ఈ ముగ్గురు నేతల ఉమ్మడి లక్ష్యం. అందుకే విజయ్ చుట్టూ ఒక పక్కా పొలిటికల్ ఫెన్సింగ్ నిర్మించారు అంటూ తమిళనాట చర్చ మొదలైంది.

ఈ మొత్తం వ్యవహారంలో విజయ్‌ కి దిశానిర్దేశం చేస్తున్నది ఆయన వ్యక్తిగత సలహాదారుల బృందం, మాజీ అధికారులతో కూడిన టీమ్. ఢిల్లీ నుండి రాహుల్ గాంధీ పంపిన రాజకీయ వ్యూహకర్తలు కూడా విజయ్ చుట్టూ ఉండి ప్రతి అడుగును పర్యవేక్షిస్తున్నారు. డీఎంకేతో ఇన్ డైరెక్ట్ గా ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతూనే, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను చీల్చే అవకాశం ఉందనే సంకేతాలు ఇవ్వడం ద్వారా విజయ్ గవర్నర్‌ పై ఒత్తిడి పెంచుతున్నారు. అందుకే పదే పదే గవర్నర్ వద్దకు వెళ్తున్నారు.

Also Read : సీఎం సచివాలయంలో ఉండగా.. భయపెట్టిన ప్రచారం..!

స్టాలిన్ కూడా విజయ్‌ ను ముందుకు నెట్టి ఆయన వైఫల్యాలను తర్వాత వాడుకోవాలని చూస్తున్నారు. ఇక విజయ్ ఎలాగైనా అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో అన్నాడిఎంకే అధికారంలోకి రాకుండా చేయవచ్చని, ఫలితంగా బిజెపిని అడ్డుకున్నట్లు అవుతుందని స్టాలిన్ భావిస్తున్నారు. ఇక విజయ్ మాత్రం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని తన పాలనతో ముద్ర వేయాలని చూస్తున్నారు. మొత్తానికి విజయ్ చుట్టూ జరుగుతున్నది కేవలం ప్రమాణస్వీకార హడావుడి మాత్రమే కాదు, ఇది తమిళనాడు రాజకీయ చరిత్రలో అతిపెద్ద వ్యూహాత్మక యుద్ధంగా చూడవచ్చు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సీఎం సచివాలయంలో ఉండగా.....

ఏపీ రాజధాని అమరావతిలోని సచివాలయం వద్ద...

ఏపీలో ఇక 24...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త వాహనాల కొనుగోలుదారులకు...

బీజేపీలోకి కొడాలి నాని.....

కొడాలి వెంకటేశ్వరరావు అంటే చాలా మందికి...

తమిళ పొలిటికల్ థ్రిల్లర్.....

తమిళనాడు రాజకీయాలు నిమిషానికో మలుపు తిరుగుతూ...

ఆపరేషన్ సుమతి.. టార్గెట్...

“ఏ రోజైతే ఒక మహిళ అర్ధరాత్రి...

లోకేష్ మరో రాయల్...

ఏపీ పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చే దిశగా...

పోల్స్