Saturday, September 19, 2026 11:33 PM
Saturday, September 19, 2026 11:33 PM

ఇన్ అండ్ అవుట్.. ముహుర్తం ఫిక్స్..!

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు పూర్తవుతుంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పరిపాలనలో వేగం పెంచడం, రాబోయే సవాళ్లను ఎదుర్కోవడం లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించేందుకు సిద్ధమవుతున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. మంత్రివర్గంలో ముగ్గురు కొత్త వాళ్లకు చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇందులో ఖాళీగా ఉన్న ఒక స్థానంతో పాటు, పనితీరు సరిగా లేని ఇద్దరు మంత్రులను తప్పించి వారి స్థానాలను భర్తీ చేయాలని అధిష్టానం భావిస్తోంది.

Also Read : నిజంగా కేసీఆర్ కు పుడితే.. బండి సంజయ్ సంచలనం..!

ముఖ్యంగా ప్రజలతో నేరుగా సంబంధం ఉండే కీలక శాఖల మంత్రుల పనితీరుపై ఇప్పటికే హైకమాండ్ నివేదికలు తెప్పించుకుంది. కొన్ని ప్రతిష్టాత్మక హామీల అమలులో వెనుకబడిన శాఖల బాధ్యతలను సమర్థులకు అప్పగించేలా భారీ మార్పులు జరగనున్నాయి. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంశం మరోసారి చర్చకు వచ్చింది. తనకు మంత్రి పదవి ఇస్తామని గతంలో హైకమాండ్ హామీ ఇచ్చిందని ఆయన పదే పదే చెప్తున్నారు. అయితే, ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి ఇప్పటికే తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈసారి కేబినెట్ లో చోటు దక్కుతుందా లేదా అనేది ఆసక్తి రేపుతోంది. అయితే కోమటిరెడ్డి సోదరుల్లో ఒకరికే అవకాశం అనే నిబంధనను అధిష్టానం తెరపైకి తెచ్చినట్లు సమాచారం.

ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి చోటు కల్పించాల్సి వస్తే, వెంకటరెడ్డిని కేబినెట్ నుంచి తప్పించే అవకాశం ఉంది. పైగా సీఎం రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి గ్యాప్ వచ్చినట్లు సమాచారం. మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉండబోతున్నాయని తెలియగానే పలువురు సీనియర్లు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎస్టీ కోటాలో మహబూబాబాద్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్, బాలూ నాయక్ మధ్య పోటీ నెలకొంది. బీసీ కోటాలో మున్నూరు కాపు వర్గం నుండి ఆది శ్రీనివాస్ పేరు వినిపిస్తోంది. ఇక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కూడా మంత్రివర్గంలో చోటుకోసం ప్రయత్నిస్తున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సైతం కేబినెట్ లోకి వెళ్లాలని ఆశిస్తున్నట్టు సమాచారం. కేవలం కేబినెట్ మాత్రమే కాకుండా, టీపీసీసీలో ఖాళీగా ఉన్న కార్యనిర్వాహక అధ్యక్షుల నియామకంపై కూడా కసరత్తు జరుగుతోంది.

Also Read : విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ చీప్ ట్రిక్స్..!

ఎస్సీ మాదిగ వర్గం నుంచి సంపత్ కుమార్, ఎస్టీ లంబాడ వర్గం నుంచి బలరాం నాయక్ లేదా బెల్లయ్య నాయక్‌ను కార్యవర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి నాయిని రాజేందర్ రెడ్డి లేదా చామల కిరణ్ కుమార్ రెడ్డికి చోటు దక్కవచ్చు. మైనార్టీల నుంచి అజ్మతుల్లా, ఫహీమ్ ఖురేషీ స్థానం ఆశిస్తున్నారు. వీళ్లతో పాటు ప్రచార కమిటీ ఛైర్మన్‌గా మధుయాష్కీని కొనసాగించాలా లేదా అన్నది. కోశాధికారిగా రోహిన్ రెడ్డి నియామకం వంటి అంశాలపై త్వరలోనే స్పష్టత రానుంది. మొత్తానికి జూన్ 2 లోపు జరగబోయే ఈ మార్పులు అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలోనూ కొత్త జోష్ నింపుతాయా లేక అసంతృప్తులకు దారి తీస్తాయా అన్నది వేచి చూడాలి

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్