Saturday, June 20, 2026 03:03 AM
Saturday, June 20, 2026 03:03 AM

బ్రేకింగ్: ఒంటిమిట్ట అర్చకులకు టీటీడీ షాక్..!

కడప జిల్లా ఒంటిమిట్టలోని ప్రసిద్ధ శ్రీ కోదండ రామాలయ అర్చకులు చిక్కుల్లో పడ్డారు. టీటీడీ నిబంధనలను బేఖాతరు చేస్తూ, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా రాజకీయ నేతలను కలవడంపై టీటీడీ సీరియస్ అయింది. మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి వేద ఆశీర్వచనం అందజేసిన ముగ్గురు అర్చకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల పులివెందుల పర్యటనలో ఉన్న వైఎస్ జగన్‌ను ఒంటిమిట్ట ఆలయ అర్చకులు ఎ.శ్రావణ్‌ కుమార్, వీణా మనోజ్‌ కుమార్, కె.పార్థసారథి ప్రత్యేకంగా కలిశారు.

Also Read : పిఠాపురంలోనే ఎందుకు ఆ సమస్య..?

కేవలం కలవడమే కాకుండా.. రాములోరి శేష వస్త్రం, తోమాల మాలలు, ముత్యాల తలంబ్రాలను ఆయనకు అందజేశారు. అత్యంత పవిత్రమైన ఆలయ మర్యాదలను, ప్రసాదాలను ఒక రాజకీయ నేత వద్దకు తీసుకువెళ్లడంపై టీటీడీ విజిలెన్స్ మరియు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ నిబంధనల ప్రకారం.. ఆలయ మర్యాదలు లేదా ప్రసాదాలను బయటి వ్యక్తులకు, ముఖ్యంగా రాజకీయ నేతలకు అధికారిక అనుమతి లేకుండా అందజేయడం నిషిద్ధం.

Also Read : సాక్షిపై గోరంట్ల సంచలన వ్యాఖ్యలు..!

అర్చకుల ఈ అత్యుత్సాహం ఆలయ ప్రతిష్టను దెబ్బ తీసేలా ఉందని భావించిన డిప్యూటి ఈఓ ఎ.ప్రశాంతి, సదరు అర్చకులకు మెమోలు జారీ చేశారు. ఈ వ్యవహారంపై రెండు రోజుల్లోగా రాతపూర్వక వివరణ ఇవ్వాలని అర్చకులను ఆదేశించారు. సరైన వివరణ ఇవ్వని పక్షంలో వారిపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీలో ప్రక్షాళన జరుగుతున్న తరుణంలో, అర్చకులు ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

పోల్స్