Saturday, September 19, 2026 04:10 PM
Saturday, September 19, 2026 04:10 PM

ప్రఫుల్ ఫాలోయింగ్ మామూలుగా లేదు..!

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ టీమ్ 216 రన్స్ చేయగా.. రాజస్థాన్ జట్టు 159 పరుగులకే ఆలౌట్ అయ్యింది. లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు తలి ఓవర్‌లోనే 3 వికెట్లు కోల్పోయింది. సన్ రైజర్స్ బౌలర్ ప్రఫుల్ హింగే తొలి ఓవర్‌లో ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఓవర్‌లోనే కెప్టెన్ పరాగ్‌ను కూడా పెవిలియన్‌కు పంపి హైదరాబాద్ గెలుపు ఖాయం చేశాడు.

Also Read : క్లీన్ ఎలక్షన్ సాధ్యమేనా..?

ప్రస్తుతం ఐపీఎల్‌లో ప్రఫుల్ పేరు మారు మోగిపోతోంది. ఐపీఎల్ చరిత్రలో తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ప్రఫుల్ రికార్డుల్లోకి ఎక్కాడు. వాస్తవానికి మ్యాచ్‌కు ముందు ప్రఫుల్ పేరు చాలా తక్కువ మందికే తెలుసు. కానీ రాజస్థాన్‌తో మ్యాచ్ తర్వాత ప్రఫుల్ ఫాలోయింగ్‌ భారీగా పెరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రఫుల్ క్రేజ్ నడుస్తోంది. మ్యాచ్‌కు ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రపుల్ హింగేకు కేవలం 3 వేల మంది ఫాలోవర్లు మాత్రమేే ఉన్నారు. కానీ రాజస్థాన్ మ్యాచ్‌ తర్వాత ప్రఫుల్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రఫుల్ ఓ సెన్సేషన్‌గా మారిపోయాడు.

Also Read : ఢిల్లీలో ఆయనకు బ్రేకులు వేయడానికే.. అశాంతి అస్త్రం..?

ప్రఫుల్ ఫాలోవర్స్ సంఖ్య ఒక్క రాత్రిలోనే 3 వేల నుంచి ఏకంగా మూడున్నర లక్షలు దాటేసింది. ఒక్క మ్యాచ్‌తోనే ఈ రేంజ్ క్రేజ్ రావడం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడిన ప్రఫుల్.. వరుస విజయాలతో దూసుకెళ్తున్న రాజస్థాన్ జట్టు ఘోరంగా ఓడిపోవడానికి ప్రధాన కారణమయ్యాడు. తొలి మ్యాచ్‌లోనే 4 ఓవర్లు బౌలింగ్ చేసిన ప్రఫుల్ 34 రన్స్ ఇచ్చి కీలకమైన 4 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వైభవ్ సూర్యవంశీని తొలి బంతికే అవుట్ చేసి అందరి దృష్టిని ప్రఫుల్ హింగే ఆకర్షించాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్