Friday, October 9, 2026 02:36 AM
Friday, October 9, 2026 02:36 AM

లగ్జరీ కార్ల ప్రియులకు పండగే.. రూ. 75 లక్షల వరకు తగ్గనున్న ల్యాండ్ రోవర్ ధర..!

మీరు లగ్జరీ కార్ల కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇది అదిరిపోయే శుభవార్త చెప్తోంది కేంద్రం. ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. ఒక్కో మోడల్‌ పై ఏకంగా రూ. 40 లక్షల నుండి రూ. 75 లక్షల వరకు ధర తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి. భారత్ – యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఈ భారీ తగ్గింపుకు ప్రధాన కారణం.

Also Read : జనసేన బలహీనమవుతుందా.. బలపడుతుందా..!

ఈ ఒప్పందం ఫలితంగా బ్రిటన్ నుండి దిగుమతి చేసుకునే కార్లపై కస్టమ్స్ సుంకాలు భారీగా తగ్గనున్నాయి. ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చే లగ్జరీ కార్లపై భారత్ విధిస్తున్న అధిక పన్నుల భారం ఈ ఒప్పందంతో గణనీయంగా తగ్గనుంది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ గ్రూప్‌లోని టాప్ ఎండ్ మోడల్స్ అయిన రేంజ్ రోవర్, డిఫెండర్ వంటి కార్ల ధరల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపించనుంది. ముఖ్యంగా బ్రిటన్‌లో తయారై భారత్‌కు వచ్చే సిబియు కార్ల ధరలు రూ. 75 లక్షల వరకు తగ్గే ఛాన్స్ ఉంది.

Also Read : వార్ ఎఫెక్ట్.. ఫ్లైట్ చార్జీల బాదుడు ఓ రేంజ్ లో..!

టాటా మోటార్స్ యాజమాన్యంలోని జేఎల్‌ఆర్, ఇప్పటికే కొన్ని మోడళ్లను భారత్‌ లోనే అసెంబ్లింగ్ చేస్తోంది. అయితే ఈ కొత్త ఒప్పందం అమల్లోకి వస్తే, దిగుమతి చేసుకునే ప్రీమియం కార్ల ధరలు కూడా సామాన్యులకు అందుబాటులోకి వస్తాయి. ఈ తగ్గింపుతో లగ్జరీ కార్ల మార్కెట్‌లో పోటీ మరింత పెరగనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ మీరు ల్యాండ్ రోవర్ కొనాలనుకుంటే, ఈ ఒప్పందం పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చే వరకు ఆగడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఇది జగన్ వ్యూహమా?...

స్థానిక సంస్థల ఎన్నికల్లో YSRCP వ్యవహరిస్తున్నతీరు...

స్థానిక సంస్థల ఎన్నికల...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల...

టీటీడీ పై విజయసాయిరెడ్డి...

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పునర్వ్యవస్థీకరణ,...

గాల్లోనే విమానంపై పడ్డ...

ఆకాశంలో ప్రయాణిస్తున్న ఒక విమానంలో ప్రయాణికులకు...

రాజకీయాల్లోకి యంగ్ హీరో...

తమిళనాట సినీ గ్లామర్‌కు, రాజకీయాలకు ఎప్పుడూ...

ప్లాస్టిక్ కరెన్సీ రెడీ.....

రూ.2 వేల నోట్లు ఇప్పుడు ఎక్కడా...

పోల్స్