Thursday, April 2, 2026 09:53 PM
Thursday, April 2, 2026 09:53 PM

వైసీపీ నేతలు డబుల్ గేమ్.. వాటి విషయం ఏమైంది..?

వంశధార రెండో దశ నిర్మాణ పనులు నత్తనడక.. మడ్డువలస విస్తరణ మాయా జగత్.. అఫ్ షోర్ ప్రాజెక్టు హుష్ కాకి.. వంశధార – నాగావళి అనుసంధానం త్రిశంకు స్వర్గం.. నిర్వాసితులకు అందని సాయం, తిత్లీ తుఫాన్ బాధితులకు జరగని న్యాయం.. కార్గో ఎయిర్ పోర్ట్ ఆందోళనకు కలిసిరాని వైనం.. ఇసుక తవ్వకాలు చూస్తూ, కొన్ని పోగులకు కాపలాకాస్తూ!

ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు ఛలో మూలపేట పేరుతో హంగామా చేశారు. ఇంకా చెప్పాలంటే సామాన్య జనానికి అర్ధం కాని విచిత్ర విన్యాసం. కేవలం కార్పోరేట్ పెట్టుబడిదారీలకు మాత్రమే ఉపయోగపడే, మూలపేట పోర్ట్ తమ గొప్పదనమేనని, చెప్పుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేతలు సైతం ఈ క్రెడిట్ చోరీ పాలిటిక్స్ ట్రిక్ ప్లే చేయడం ఆశ్చర్యంగా కనిపిస్తోంది. మత్స్యకార వృత్తి వారికి ఏమాత్రం ఉపయోగం లేని మూలపపేట పోర్ట్. పిషింగ్ హార్బర్ అడిగితే.. పోర్ట్ ఇచ్చారు. ఇది ఎవరి కోసం ఇచ్చారో, ఇప్పటికీ చాలా మందికి తెలియదు. భావనపాడు నుంచి మూలపేటకు పోర్ట్ ఎందుకు మారిందో.. నిజానికి వైసీపీ నేతలకు కూడా తెలియదు.

Also Read : నేటి నుంచి అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. కీలక మార్పులు ఇవే..!

భావనపాడు పోర్ట్ అనుకున్నప్పుడు మూడు బిడ్లు వచ్చాయి. అందులో అదానీది ఒకటి. నిమ్మ కాయ సమావేశం తర్వాత, రెండు కంపెనీలు విత్ డ్రా అయిపోయాయి. సింగిల్ బిడ్ అదానీ కంపెనీది అయినా, తమకు వర్క్ అవుట్ కాదని అదానీ గ్రూప్ వెనక్కి వెళ్లింది. తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భావనపాడు నుంచి మూలపేటకు పోర్టు మారింది. దీని కాంట్రాక్టు సంస్థ విశ్వ సముద్ర. ఇదీ, అదానీకి చెందినదే! ఈ పోర్టు నుంచి అదానీ కంపెనీల ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి, అదానీ, విశాఖ గూగుల్ కంపెనీకి అనుమతులు తామే ఇచ్చామనీ, భోగాపురం ఎయిర్ పోర్ట్ మా ఘనతే అనేది వైసీపీ నేతలు పదే పదే చెబుతున్న మాట. ఇంకా చెప్పాలంటే.. బాబు సర్కార్ క్రెడిట్ చోరీ చేస్తోందని ఏకంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా చెబుతున్నారు.

Also Read : వార్ ఎఫెక్ట్.. ఫ్లైట్ చార్జీల బాదుడు ఓ రేంజ్ లో..!

అయితే శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెజారిటీ ప్రజల బాధలు, బాగోగులు ఏం పట్టించుకున్నారనేది వైసీపీ నేతలకు సిక్కోలు వాసులు వేస్తున్న సూటి ప్రశ్న. ఇంకా చెప్పాలంటే ఇదీ సగటు మనిషి వేదన కూడా. భావనపాడు పోర్ట్ మూలపేటకు ఎలా మారిందో, రాజకీయ గ్రంధసాంగులకు తెలుసు. ఆముదాలవలస షుగర్స్ అమ్మకం ఎవరి కోసమో కూడా వారికి తెలుసు. మూలపేట సామాన్యుడి సమస్య కాదు, గొప్ప విషయం. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, వైసీపీ నేతల ధర్నాలు, ఆందోళలు కేవలం బడా బాబుల కోసమే తప్ప.. నిర్వాసితుల కోసం పల్లెత్తు మాట కూడా అనలేదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బాబుకి తలనొప్పిగా మారుతున్న...

తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేల వ్యవహారశైలి టిడిపి...

బాబు మాస్టర్ స్ట్రోక్.....

అమరావతి అభివృద్ధి దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి...

అంచనాలు పెంచిన ‘రామాయణ’...

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణం...

అమరావతి అంటే జగన్...

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని శాశ్వత రాజధాని...

ఎమ్మెల్యేలు సీరియల్స్ చూడటం...

కూటమి ప్రభుత్వంలోని కొందరు ఎమ్మెల్యేల తీరుపై...

ఈసారి మావిగన్ అంటున్న...

ఎవరికైనా చూపించండి రా.. అలా వదిలేయకండి...

పోల్స్