Saturday, September 19, 2026 06:51 AM
Saturday, September 19, 2026 06:51 AM

ట్రంప్ భయానికి కారణం ఇరాన్ షాక్ ట్రీట్‌మెంటేనా..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా ఇరాన్ యుద్ధాన్ని ముగించాలని ఎందుకు నిర్ణయించుకున్నారు..? ఇప్పుడు ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. లక్ష్యాలను చేరుకున్నాం అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యల వెనుక ఇరాన్.. చేసిన ఊహించని దాడులు ఉన్నాయనే మాటలు వినపడుతున్నాయి. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు అమెరికా రక్షణ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపాయి. హిందూ మహాసముద్రంలోని అమెరికా అత్యంత సురక్షిత వ్యూహాత్మక స్థావరం డియాగో గార్సియాపై ఇరాన్ దాడికి దిగింది.

Also Read : బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్ రెడ్డి.. అసలేం జరుగుతోంది..?

సుమారు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దీవిని ఇరాన్ క్షిపణులు లక్ష్యం చేసుకోవడం అమెరికాను నివ్వెరపరిచింది. ఇరాన్ క్షిపణి పరిధి పెరిగిందని, అమెరికా ఏ స్థావరం కూడా సురక్షితం కాదని దీనితో స్పష్టమైంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్‌ ను ఇరాన్ రక్షణ వ్యవస్థలు కూల్చివేసాయనే వార్త అమెరికా సైనిక ప్రతిష్టను దెబ్బతీసింది. వందల కోట్ల డాలర్ల విమానాలు నేలకూలితే అమెరికా భరించలేనంత ఆస్తి నష్టం వాటిల్లుతుందని ట్రంప్ గ్రహించారు.

Also Read : దుమారం రేపుతున్న గరికపాటి వ్యాఖ్యలు..!

ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ ఎన్‌ జీ ప్లాంట్‌ ను ఇరాన్ క్షిపణులు తాకడంతో అంతర్జాతీయ ఇంధన సరఫరాకు ముప్పు ఏర్పడింది. ఇది గనుక ధ్వంసమైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని అమెరికా ఆందోళన చెందింది. ఈ దాడుల తీవ్రతను చూశాక, యుద్ధం కొనసాగిస్తే అమెరికాకు లాభం కంటే నష్టమే ఎక్కువని ట్రంప్ భావించినట్లు తెలుస్తోంది. అందుకే ఇరాన్‌ తో నేరుగా తలపడకుండా, గౌరవప్రదంగా యుద్ధం నుండి తప్పుకునేందుకు ఆయన చర్చల మార్గాన్ని ఎంచుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

వైసీపీలో విచిత్ర పరిస్థితి.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

నిర్ణయం చంద్రబాబు.. పవన్...

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై...

పోల్స్