Saturday, September 19, 2026 12:25 PM
Saturday, September 19, 2026 12:25 PM

చిరంజీవి ‘భజన’పై తీవ్ర విమర్శలు..!

రాజకీయాల్లో సినిమా వాళ్ళు వేలు పెట్టడం అనేది సహజమే. కాని దాని తీవ్రత మాత్రం అధికంగా ఉంటుంది అనే మాట వాస్తవం. ఇప్పుడు చిరంజీవి ఇలా వేలు పెట్టి విమర్శలు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌ లో ఉగాది సందర్భంగా నిర్వహించిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌ గా మారాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఆయన చేసిన పరోక్ష విమర్శలు రాజకీయ దుమారానికి దారితీశాయి.

Also Read : అగార్కర్ పదవీ కాలం పొడిగిస్తారా..?

గద్దర్ పేరిట తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తొలి అవార్డుల వేడుకలో చిరంజీవి.. ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం కేవలం కృతజ్ఞతలకే పరిమితం కాకపోవడం గమనార్హం. సినిమా రంగాన్ని, కళాకారులను గౌరవించడంలో తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్న చొరవ అభినందనీయం.. దురదృష్టవశాత్తు ఏపీ, కళాకారులను ప్రోత్సహించడంలో, అవార్డులు ఇవ్వడంలో వెనుకంజలో ఉంది అని చిరంజీవి వ్యాఖ్యానించారు. చాలా కాలంగా ఏపీలో నంది అవార్డులు ఇవ్వకపోవడాన్ని చిరంజీవి పరోక్షంగా విమర్శించడం చర్చనీయాంశం అయింది.

Also Read : ఉద్యోగాలకు ‘ఏఐ’ ఎసరు, 90 శాతం కంపెనీల సంచలన నిర్ణయం..?

దీనిపై టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ‘మూల విరాట్’ గా అభివర్ణిస్తూ చిరంజీవి చేసిన ప్రసంశలపై కూడా ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యమంత్రిని అంతలా పొగడటం వెనుక పరిశ్రమకు సంబంధించిన కొన్ని రాయితీలు లేదా ప్రోత్సాహకాలు పొందే వ్యూహం ఉందా అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై కూటమి కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో కనీసం సినిమాల షూటింగ్ కూడా చేయడం లేదని, ప్రతీ సినిమాకు టికెట్ రేట్స్ పెంచుతున్నప్పుడు ఇంకేం సహకారం కావాలని అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి వాడిన భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. గతంలో జగన్ పై ఆయన ఎందుకు ఇలా వ్యాఖ్యలు చేయలేదు అంటూ పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా ఏపీ ప్రభుత్వాన్ని తక్కువ చేయడం వల్ల రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ సినిమా రాజకీయం మొదలయ్యే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వాన్ని అతిగా ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఏపీ ప్రభుత్వంతో సఖ్యత దెబ్బతినే ప్రమాదం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్