Tuesday, May 5, 2026 06:30 AM
Tuesday, May 5, 2026 06:30 AM

భారత్ లో గ్యాస్ కొరత తీవ్రం కానుందా..?

యుద్దంలో తమను తక్కువ అంచనా వేసిన అమెరికా మిత్ర దేశాలకు ఇరాన్ చుక్కలు చూపిస్తోంది. తాజాగా ఇరాన్ చేసిన ఓ దాడి ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఖతార్‌లోని అతిపెద్ద సహజ వాయువు ప్లాంట్ అయిన రాస్ లఫాన్‌ పై ఇరాన్ క్షిపణి దాడి చేసిన నేపథ్యంలో అంతర్జాతీయ చమురు, గ్యాస్ మార్కెట్లలో గందరగోళం తీవ్రమైంది. మధ్యప్రాచ్య యుద్ధం దెబ్బకు ఇప్పటికే.. చమురు, గ్యాస్ నిల్వలపై ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ దాడితో ఇరాన్, అమెరికా ఆస్తులను లక్ష్యంగా చేసుకోవడంతో పాటు ఇంధన కేంద్రాలపై కూడా దాడులు చేసింది.

Also Read : హెరిటేజ్‌కి రాయితీలు.. అసలు లెక్క ఇది.. తప్పేముంది జగన్‌..?

ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ ఎన్ జీ కేంద్రంపై జరిగిన దాడి ఫలితంగా, ఆ ప్రదేశంలో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. అమెరికా, ఆస్ట్రేలియా, రష్యాలతో పాటు ఖతార్ కూడా ప్రపంచంలోని భారీ ఎత్తున ఎల్ ఎన్ జీ ఉత్పత్తి చేస్తోంది. మార్చి మొదటి వారంలో కూడా, ఇరాన్ ఖతార్ గ్యాస్ క్షేత్రాలపై క్షిపణి దాడులు చేసింది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు ఎగుమతిదారు అయిన ఖతార్ ఎనర్జీ ఉత్పత్తిని నిలిపివేయవలసి వచ్చింది. అయితే ఈ ప్రభావం భారత్ పై తీవ్రంగా పడుతోంది. భారత్ తన సహజ వాయువు అవసరాలలో సుమారు 50% అంతర్జాతీయ మార్కెట్ నుండి సేకరిస్తుంది.

Also Read : మూవీ రివ్యూ : దురంధర్: ది రివెంజ్

ముఖ్యంగా, దాదాపు 20% ఖతార్ నుండి దిగుమతి చేసుకుంటుంది. దీనితో భారత్.. తన గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవలసి ఉంటుంది. పారిశ్రామిక రంగాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఇంకా ముఖ్యంగా విద్యుత్ రంగంలో గ్యాస్ వినియోగాన్ని తగ్గించాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం, భారత్ యొక్క రోజువారీ సహజ వాయువు వినియోగం 189 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు. ఇందులో 97.5 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు దేశీయంగా ఉత్పత్తి అవుతోంది. గత వారం నాటికి, అనివార్య పరిస్థితుల కారణంగా, భారత్ సహజ వాయువు దిగుమతులలో 47.4 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సరఫరాలకు అంతరాయం ఏర్పడింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బెంగాల్‌.. కమల వికాసం.....

మినీ సార్వత్రిక ఎన్నికలుగా పరిగణించిన ఐదు...

ఓటమి దిశగా ముగ్గురు...

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌...

విజయ్‌‍కు ఏఐఏడీఎంకే మద్దతు...

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు...

తమిళనాట రాజకీయ సంచలనానికి...

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌కు...

తమిళనాట ఎన్నికల ఫలితాలు.....

తమిళ రాజకీయాల్లో గత కొన్నాళ్ళుగా ఆసక్తి...

కల్తీ నెయ్యిలో వైవీ...

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కుంభకోణంపై...

పోల్స్