Thursday, September 17, 2026 05:20 PM
Thursday, September 17, 2026 05:20 PM

పవన్ ఫ్యాన్స్ ను వెంటాడుతున్న దురంధర్..!

ఒకప్పుడు అంటే వేరే భాషల సినిమాలు రిలీజ్ అయితే.. డబ్బింగ్ సినిమాలుగా చిన్న చూపు ఉండేది. కాని పాన్ ఇండియా ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత సీన్ రివర్స్ లో నడుస్తోంది. ఇప్పుడు ఇదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై పడుతోంది. మోస్ట్ అవేటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ మీద ఇప్పుడు దురంధర్ ఎఫెక్ట్ ఖాయంగా కనపడుతోంది. మెగా ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వసూళ్లపై ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంది.

Also Read : పంత్ కు డూ ఆర్ డై సీజన్.. అంచనాలు అందుకుంటాడా..?

నిజానికి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సింది. కానీ పవన్ కళ్యాణ్ పరిపాలనలో బిజీగా ఉండటంతో, అది వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు రిలీజ్ అవుతున్నా సరే.. అదే టైంలో దురంధర్ 2 రిలీజ్ అవుతుంది. దీనివల్ల ఉస్తాద్ సినిమాకు రావాల్సిన నార్మల్ ఆడియన్స్ తగ్గుతారనే భయం ఫ్యాన్స్ లో కనపడుతోంది. వాస్తవానికి తెలుగులో మరో పెద్ద సినిమా లేదు. కానీ దురంధర్ సీక్వెల్ కు తెలుగు సినిమాల కంటే ఎక్కువ క్రేజ్ ఉంది. ఇప్పుడు ఇదే పవన్ ఫ్యాన్స్ ను, సినిమా యూనిట్ ను కంగారు పెడుతోంది.

Also Read : త్రిషకు చెన్నైలోనే సీటు..? విజయ్ టూ అమిత్ షా వయా త్రిష..!

దురంధర్ 2 కూడా ఒక భారీ మాస్ యాక్షన్ సినిమాగానే రిలీజ్ అవుతోంది. దురంధర్ 2లో వాడిన హై-ఎండ్ విజువల్స్, స్టంట్ కొరియోగ్రఫీ చూసిన తర్వాత, పాత పద్ధతిలో యాక్షన్ సీన్లు తీస్తే ప్రేక్షకులు మెచ్చరనే భయం మేకర్స్‌లో మొదలైంది. హరీష్ శంకర్ ఇప్పుడు ఉస్తాద్‌లోని కొన్ని కీలక యాక్షన్ ఎపిసోడ్లను దురంధర్ 2 స్థాయికి తగ్గకుండా రీ-షూట్ లేదా గ్రాఫిక్స్ ను యాడ్ చేసే పనిలో ఉన్నట్లు టాక్. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో తక్కువ టైంలో అంత క్వాలిటీ అవుట్‌పుట్ ఇవ్వడం హరీష్ శంకర్‌కు కత్తి మీద సాములా మారింది. మరి దురంధర్ 2 దెబ్బ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్