Sunday, May 3, 2026 02:31 PM
Sunday, May 3, 2026 02:31 PM

సీనియర్ అధికారులు వర్సెస్ ట్రంప్.. యుద్ధం వద్దంటే వద్దు..!

ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం తీవ్రత రోజు రోజుకి పెరుగుతోంది. ఈ క్రమంలో అమెరికా ప్రభుత్వంలో కీలక మార్పులు ఆ దేశ ప్రభుత్వాన్ని ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా ప్రభుత్వంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ యుద్ధం విషయంలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ జో కెంట్ తన పదవికి రాజీనామా చేశారు. మార్చి 17న ఈ పరిణామం ట్రంప్ ప్రభుత్వంలో ఇరాన్ విధానంపై నెలకొన్న అంతర్గత విభేదాలను బహిర్గతం చేసింది.

Also Read : పైలట్ రోహిత్ రెడ్డి ఫాం హౌస్‌కు సర్కారు తాళం..?

జో కెంట్ తన రాజీనామా లేఖలో ట్రంప్ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అమెరికాకు ఇరాన్ నుండి ఎటువంటి తక్షణ ముప్పు లేకపోయినప్పటికీ, ఈ యుద్ధాన్ని ప్రారంభించారని కెంట్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్, వాషింగ్టన్‌ లోని శక్తివంతమైన లాబీ గ్రూపుల ఒత్తిడి వల్లే ట్రంప్ ఈ యుద్ధానికి పూనుకున్నారని ఆయన ఆరోపించారు. కేవలం బాహ్య ప్రయోజనాల కోసం అమెరికా సైనికుల ప్రాణాలను పణంగా పెట్టడాన్ని తన మనస్సాక్షి అంగీకరించడం లేదని కెంట్ స్పష్టం చేశారు. ఈ రాజీనామాపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు.

Also Read : ఏపీలో ఇంద్రధనుస్సు.. దివ్యాంగులకు ఫ్రీ బస్సు..!

జో కెంట్ రాజీనామా చేయడం మంచి విషయమేనని వ్యాఖ్యానించారు. కెంట్ భద్రతా విషయాల్లో చాలా బలహీనంగా ఉన్నారని, అలాంటి వారు ప్రభుత్వంలో ఉండాల్సిన అవసరం లేదని ట్రంప్ కొట్టిపారేశారు. ఇరాన్ ప్రతి దేశానికి ముప్పు అని, దాన్ని ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ పునరుద్ఘాటించారు. ట్రంప్ ఇరాన్‌ పై దాడులను ఉధృతం చేస్తుండటం, సీనియర్ మిలిటరీ మరియు ఇంటెలిజెన్స్ అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని 10 శాతానికి తగ్గించామని, కీలక నౌకలను ముంచేశామని ట్రంప్ ప్రకటించినప్పటికీ, యుద్ధం వల్ల కలిగే దీర్ఘకాలిక నష్టంపై అధికారులు భయపడుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సీఐని సస్పెండ్ అయ్యే...

పల్నాడు జిల్లా వినుకొండలో ఒక పోలీస్...

రష్మీని టార్గెట్ చేసిన...

యాంకర్ రష్మీ గౌతమ్‌ను వైసీపీ నేతలు...

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం...

ఆంధ్రప్రదేశ్ జీవనాడి, బహుళార్థసాధక ప్రాజెక్టు అయిన...

టీడీపీ ఎమ్మెల్యే సంచలన...

ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో...

బ్రేకింగ్ : కల్తీ...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో...

బ్రేకింగ్: డిప్యూటి సీఎం...

ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు హైదరాబాద్‌లో...

పోల్స్