Thursday, September 17, 2026 05:24 PM
Thursday, September 17, 2026 05:24 PM

నేను హార్ట్ పేషెంట్.. పుట్టా మహేష్ సంచలన కామెంట్స్

గత రెండు రోజుల నుంచి సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏలూరు టిడిపి ఎంపీ పుట్ట మహేష్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేసారు. తాను అసలు డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టం చేస్తూ.. తనకు డ్రగ్స్ అలవాటు లేదని, ఎన్నడూ డ్రగ్స్ ముట్టుకొని తనకు పాజిటివ్ ఏ విధంగా వస్తుందని నిలదీశారు. తనకు గుండె సమస్యలు ఉన్నాయన్న పుట్టా మహేష్, కొన్నేళ్ల క్రితం గుండెలో స్టంట్ కూడా పడిందని, డాక్టర్ అనుమతి లేకుండా తాను ఎటువంటి డ్రగ్స్ తీసుకునే అవకాశం లేదన్నారు.

Also Read : ట్రంప్ పై తీవ్ర ఒత్తిడి..? ఎగ్జిట్ ప్లాన్ రెడీ చేసాడా..?

డ్రగ్స్ తీసుకుంటే తన గుండె తట్టుకోలేదని చెప్పిన మహేష్.. హార్ట్ పేషెంట్ అయిన తాను డ్రగ్స్ ఎలా తీసుకుంటానని నిలదీశారు. ఫామ్ హౌస్ లో పార్టీ జరిగిన రోజు, రాత్రి తనకు అసలు బ్లడ్ టెస్ట్ జరగలేదని, తన రక్తం కూడా ఎవరూ తీసుకోలేదని సంచలన కామెంట్స్ చేసారు. పోలీస్ స్టేషన్ నుంచి రాగానే మూడు వేరు వేరు డయాగ్నోస్టిక్ సెంటర్స్ లో రక్త పరీక్షలు చేయించానని, ఒక్క దానిలో కూడా తాను డ్రగ్స్ తీసుకున్నట్టు, ఎక్కడ రుజువు కాలేదని చెప్పుకొచ్చారు. మూడు వేరువేరు డయాగ్నొస్టిక్ సెంటర్స్ లో టెస్ట్ చేయించిన పరీక్షల వివరాలను మహేష్ సోషల్ మీడియాలో మహేష్ పోస్ట్ చేశారు.

Also Read : 24 గంటల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు..!

తన దగ్గర నుంచి పోలీసులు రక్త నమూనానే తీసుకోలేదని, అటువంటప్పుడు పాజిటివ్, నెగిటివ్ వచ్చిందని ఎలా చెప్తారని మహేష్ నిలదీశారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీకి తాను హాజరైన మాట వాస్తవమేనని, పూర్వ పరిచయం కొద్దీ ఫామ్ హౌస్ కెళ్ళి అరగంట గడిపానే తప్ప అక్కడ ఎటువంటి మాదగద్రవ్యాలు తీసుకోలేదని స్పష్టం చేసారు. తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని వాపోయిన ఎంపీ.. ఇదే విషయంపై కోర్టును కూడా ఆశ్రయించబోతున్నానని ప్రకటించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్