Sunday, May 3, 2026 12:59 PM
Sunday, May 3, 2026 12:59 PM

ట్రంప్ పై తీవ్ర ఒత్తిడి..? ఎగ్జిట్ ప్లాన్ రెడీ చేసాడా..?

రోజుల తరబడి సాగుతోన్న ఇజ్రాయిల్, అమెరికా – ఇరాన్ యుద్ధం నేపధ్యంలో.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై ఒత్తిడి తీవ్రమవుతుందా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ప్రస్తుతం ఇరాన్ యుద్ధాన్ని ముగించాలనే ఒత్తిడి అంతర్గతంగా, అంతర్జాతీయంగా తీవ్రమవుతోంది. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఇరాన్-అమెరికా యుద్ధం నేపథ్యంలో వైట్ హౌస్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. యుద్ధం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థపై భారం పడుతోందని, తక్షణమే యుద్ధం నుంచి వైదొలగాలని వైట్ హౌస్ సలహా మండలి అధ్యక్షుడు ట్రంప్‌ ను కోరుతోంది.

Also Read : 24 గంటల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు..!

యుద్ధం ప్రారంభమైన కేవలం 18 రోజుల్లోనే సుమారు 12 బిలియన్ డాలర్ల వ్యయం అయినట్లు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో.. చమురు ధరలు బ్యారెల్‌ కు 100 డాలర్ల మార్కును దాటడం కూడా ఆందోళన కలిగిస్తోంది. గతంలో జరిగిన యుద్ధాల కంటే భిన్నంగా, ప్రస్తుతం మెజారిటీ అమెరికన్లు సుమారు 56% మంది ఇరాన్‌ పై సైనిక చర్యను వ్యతిరేకిస్తున్నారు. ఇరాన్ అణు వ్యవస్థలను దెబ్బతీసే లక్ష్యం దాదాపు పూర్తయిందని, త్వరలోనే యుద్ధం ముగిస్తామని ట్రంప్ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read : వన్డేలపై సూర్య కుమార్ సంచలన కామెంట్స్..!

అయితే, తమకు అనుకూలమైన నిబంధనలు కుదిరే వరకు పోరాటం కొనసాగుతుందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ ఘర్షణల వల్ల గ్లోబల్ ఎయిర్ ట్రావెల్, చమురు ఎగుమతులకు తీవ్ర అంతరాయం కలిగింది. దీనితో అంతర్జాతీయంగా ఒత్తిడి తీవ్రమవుతోంది. గల్ఫ్ దేశాల సేఫ్ ఇమేజ్ కూడా ఈ యుద్ధం కారణంగా దాదాపుగా నాశనం అయింది. దుబాయ్ నగరంలో పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. అమెరికన్ కాంగ్రెస్‌లో డెమొక్రాట్లు కూడా ‘వార్ పవర్స్ యాక్ట్’ ద్వారా యుద్ధాన్ని 30 రోజుల్లోగా ముగించాలని ఒత్తిడి తెస్తున్నారు. రాబోయే రోజుల్లో అమెరికా ప్రభుత్వం తీసుకోబోయే ‘ఎగ్జిట్ స్ట్రాటజీ’ అంతర్జాతీయ శాంతి భద్రతలపై కీలక ప్రభావం చూపనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సీఐని సస్పెండ్ అయ్యే...

పల్నాడు జిల్లా వినుకొండలో ఒక పోలీస్...

రష్మీని టార్గెట్ చేసిన...

యాంకర్ రష్మీ గౌతమ్‌ను వైసీపీ నేతలు...

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం...

ఆంధ్రప్రదేశ్ జీవనాడి, బహుళార్థసాధక ప్రాజెక్టు అయిన...

టీడీపీ ఎమ్మెల్యే సంచలన...

ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో...

బ్రేకింగ్ : కల్తీ...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో...

బ్రేకింగ్: డిప్యూటి సీఎం...

ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు హైదరాబాద్‌లో...

పోల్స్