Friday, June 19, 2026 07:08 AM
Friday, June 19, 2026 07:08 AM

గిల్ కెరీర్ కు ఆ ముగ్గురు ఎండ్ కార్డు..!

భారత జట్టు టి20 ప్రపంచ కప్ గెలిచింది.. సమర్ధవంతంగా ఆడి.. ట్రోఫీ కైవసం చేసుకుంది. అక్కడి వరకు బాగానే ఉంది. మరి టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ టీ20 కెరీర్ సంగతి ఏంటీ అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఒకప్పుడు మూడు ఫార్మాట్లలోనూ తిరుగులేని ఆటగాడిగా కనిపించిన గిల్, ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌లో తన స్థానాన్ని కోల్పోయే స్థితిలో ఉన్నాడు. భారత క్రికెట్ భవిష్యత్తు స్టార్ గా ఓ రేంజ్ లో ఫేమస్ అయిన శుభ్‌మన్ గిల్, వన్డే, టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ, టీ20ల్లో మాత్రం తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాడు.

Also Read : కొరివితో తలగోక్కున్న కావ్య మారన్..!

టీ20 ఫార్మాట్ అంటేనే మెరుపు వేగంతో ఆడటం. గిల్ టెక్నిక్ పరంగా గొప్ప ఆటగాడే అయినప్పటికీ, పవర్ ప్లేలో ఆశించిన స్థాయిలో వేగంగా పరుగులు రాబట్టలేకపోతున్నాడు. యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ వంటి యువ ఆటగాళ్లు మొదటి బంతి నుండే దాడి చేస్తుంటే, గిల్ ఇన్నింగ్స్ నిర్మించడానికి సమయం తీసుకుంటున్నాడు. ఆధునిక టీ20 క్రికెట్‌ లో ఇది మైనస్ పాయింట్‌ గా మారింది. ప్రస్తుతం ఓపెనింగ్ స్థానం కోసం టీమిండియాలో విపరీతమైన పోటీ ఉంది.

అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తుండగా.. మూడు మ్యాచ్ లతో సంజూ సామ్సన్ సెటిల్ అయిపోయాడు. ఇక ఇషాన్ కిషన్ కూడా తన ఆట తీరుతో జట్టులో చోటు ఖరారు చేసుకున్నాడు. అలాగే రుతురాజ్ గైక్వాడ్ కూడా కీలక ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు. వీరందరూ గిల్ కంటే మెరుగైన స్ట్రైక్ రేట్‌ తో ఆడుతుండటం గిల్‌కు తలనొప్పిగా మారింది. గత ఐపీఎల్ సీజన్లలో గిల్ అద్భుతంగా రాణించినప్పటికీ, టీమిండియా జేర్సీలో ఆ జోరును కొనసాగించలేకపోతున్నాడు.

Also Read : రాజకీయాల్లోకి ప్రీతి రెడ్డి.. గులాబీలో గుబులు..!

ముఖ్యంగా విదేశీ గడ్డపై స్పిన్నర్లకు ఎదుర్కొనే విషయంలో ఫెయిల్ అవుతున్నాడు. అలాగే ఒత్తిడిలో వికెట్ పారేసుకోవడం వంటివి విమర్శలకు దారితీస్తున్నాయి. బీసీసీఐ, సెలెక్టర్లు ఇప్పుడు అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ వైపు మొగ్గు చూపుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20ల నుండి తప్పుకున్నాక, ఆ స్థానాలను వేగంగా ఆడే వారితో భర్తీ చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో గిల్ ఒకవేళ తన స్ట్రైక్ రేట్‌ ను పెంచుకోకపోతే, అతడిని కేవలం వన్డే, టెస్టులకే పరిమితం చేసే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా...

ప్రజల్లోకి వెళ్ళాల్సిందే.. చంద్రబాబు...

ఏపీలో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్న...

బ్రేకింగ్: లోకేష్ సంచలన...

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుర్చీలో...

భయపడాల్సిన వారేమో భయపెడుతున్నారు.. భయపెట్టాల్సిన వారేమో...

పోల్స్