మధ్యాహ్న భోజన పథకం విషయంలో ఏపీ సర్కార్ సీరియస్ గా ఉన్న నేపధ్యంలో.. ఇటీవలి కాలంలో జరుగుతోన్న ఘటనలు కాస్త ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. తాజాగా మైలవరం నియోజకవర్గంలో ఓ ప్రభుత్వ స్కూల్ లో జరిగిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం దేవునిచెరువు ఎంపీపీ పాఠశాలలో నాణ్యత లేని మధ్యాహ్న భోజనం విద్యార్ధులకు పెడుతున్నారు అంటూ ఓ వీడియో వైరల్ గా మారింది. పాఠశాలలో వడ్డిస్తున్న అన్నంలో పురుగులు ఉండటం, గుడ్లు కుళ్ళిపోయి దుర్వాసన వస్తుండటంతో విద్యార్థులు తినలేకపోయారనే వీడియో వైరల్ గా మారింది.
Also Read : ‘రాజనీతి సురేష్’ పై వంద కోట్ల దావా.. అంత భయం ఎందుకు?
గత మూడు నెలలుగా భోజనం సరిగా ఉండటం లేదని ఆవేదన చెందిన విద్యార్థులు, ఆ ఆహారాన్ని తినలేక పాఠశాల ప్రాంగణంలోని డస్ట్ బిన్లలో పారబోశారు. ఇక ఆహార నాణ్యత విషయంలో.. తల్లిదండ్రులు ‘112’ అత్యవసర నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే స్కూల్ కు వెళ్లి అక్కడ విచారణ చేపట్టగా.. భోజనం బాగాలేదు అంటూ విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేయడం కూడా సంచలనం అయింది. ఇక ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన మంత్రి లోకేష్, విద్యార్థులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కూడా చెప్పారు.

విద్యార్థులు, తల్లిదండ్రులకు కలిగిన అసౌకర్యానికి లోకేష్ క్షమాపణలు చెప్పడం సంచలనంగా మారింది. విద్యార్థులకు ఉత్తమ సంరక్షణ, నాణ్యమైన సేవలకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పష్టం చేసారు. ఆహార నాణ్యత తక్కువగా ఉందని సమాచారం రాగానే విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటుచేశాం.. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఏజెన్సీని మార్చడంతో పాటు ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేశామన్నారు లోకేష్. ఇలాంటి సమస్యలు మళ్లీ తలెత్తకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేస్తున్నామని ప్రకటించారు.
Also Read : వారందరి లెక్కలు తెలుస్తాను.. రష్మిక హెచ్చరిక
ఇక త్రిసభ్య కమిటీలో హెడ్ మాస్టర్ కావాలనే అలా చేయించాడు అని తేలడం సంచలనం అయింది. విద్యార్థులే నేరుగా డస్ట్ బిన్లలో ఆహారాన్ని పారబోసి, పోలీసులకు ఫిర్యాదు చేసేలా ఉద్దేశపూర్వకంగా వ్యవహరించి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు ప్రయత్నించారని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటన వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని అనుమానించిన ప్రభుత్వం, త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

