Friday, May 1, 2026 07:57 AM
Friday, May 1, 2026 07:57 AM

యుద్ధం ఆపేది లేదు.. ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

అమెరికా, ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధం ఇప్పుడు తారా స్థాయికి చేరుకుంది. 14 రోజులు అయినా సరే యుద్ధం ఎప్పుడు కొలిక్కి వస్తుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఇరాన్ ఎక్కడా తలవంచకపోవడంతో అమెరికా, ఇజ్రాయిల్ బలగాలు తలపట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేని చేసిన హెచ్చరికలు కూడా ఇరాన్ విషయంలో ఆందోళన పెంచాయి. అటు హార్ముజ్ జల సంధి విషయంలో కూడా ఇరాన్ వెనక్కు తగ్గకపోవడంతో.. ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం పడుతోంది.

Also Read : కనపడితే పేల్చేస్తాం.. ప్రపంచం రెడీగా ఉండాలి..!

ఇక తాజాగా ఇరాన్ అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ క్షమాపణ చెప్పే వరకు తాము తలవంచే ప్రసక్తే లేదని, ఇరాన్ సీనియర్ భద్రతా అధికారి అలీ లారిజాని హెచ్చరించారు. ఇరాన్ తో యుద్ధం మొదలుపెట్టి, డోనాల్డ్ ట్రంప్ వ్యూహాత్మక తప్పు చేశారని లారిజాని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసారు. అమెరికా వెనక్కు తగ్గే వరకు.. ఇరాన్ తన సైనిక చర్యలను కొనసాగిస్తుందని స్పష్టం చేసారు. ట్రంప్ యుద్ధం గురించి చేసిన బహిరంగ ప్రకటనలను కూడా ఆయన తప్పుబట్టారు.

Also Read : వాట్సాప్ పేరెంట్ కంట్రోల్ అంటే ఏంటీ..?

యుద్ధాలను వాక్చాతుర్యం లేదా సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా పరిష్కరించలేమన్నారు. ఇక ట్రంప్ యుద్దానికి తగిన మూల్యం చెల్లిస్తారు అనే అర్ధం వచ్చేలా.. #TrumpMustPay అనే హ్యాష్‌ట్యాగ్‌తో తన పోస్ట్ చేసారు. ఇరాన్.. అమెరికాపై ఒత్తిడిని కొనసాగించాలని భావిస్తున్నట్లు ఆయన ఇచ్చిన సంకేతాలు ఇప్పుడు అంతర్జాతీయ సమాజాన్ని భయపెడుతున్నాయి. యుద్ధం నుంచి ఎలా బయటపడాలో అర్ధం కాక ట్రంప్ సతమవుతున్నారు అనే వార్తలు కూడా ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అబార్షన్ చట్టంపై సుప్రీంకోర్టు...

14 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్...

ఏపీ బ్రాండ్‌కి సచిన్‌...

నారా లోకేశ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు చూడటానికి...

తల్లికి వందనం అప్పుడే.....

2026-27 విద్యా సంవత్సరం నేపథ్యంలో కూటమి...

మరో పార్టీ నేతను...

రాజకీయాల్లో ఇప్పుడు విపరీత ధోరణి కనిపిస్తోంది....

టెన్త్ ఫలితాల్లో లోకేష్...

ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్...

చేసిన పాపం.. కార్యకర్తల...

వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జ్...

పోల్స్