Thursday, September 17, 2026 08:52 PM
Thursday, September 17, 2026 08:52 PM

షారుఖ్ ను వాడేస్తున్న పుష్ప..!

పుష్ప సినిమాతో.. ఐకాన్ స్టార్ గా మారిపోయిన, అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీ డైరెక్షన్ లో ఓ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ భారీ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాకపోగా.. ఏఏ 22 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా మేకింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ కోసం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌ ను రంగంలోకి దించుతున్నారనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. సుమారు రూ.700 కోట్ల నుంచి రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌ తో సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Also Read : కనపడితే పేల్చేస్తాం.. ప్రపంచం రెడీగా ఉండాలి..!

అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న విడుదల చేయనున్న టైటిల్ గ్లింప్స్ లేదా టీజర్‌ను షారుఖ్ ఖాన్ వర్చువల్‌ గా లేదా ముంబైలో జరిగే ఒక స్పెషల్ ఈవెంట్‌ లో ఆవిష్కరించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. కేవలం ప్రమోషన్ మాత్రమే కాకుండా, ఈ సినిమాలో షారుఖ్ ఒక పవర్‌ ఫుల్ గెస్ట్ రోల్‌ లో కనిపిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Also Read : బీఆర్ఎస్‌లో సీనియర్ల సైలెన్స్.. ఏమైంది..?

అయితే, మేకర్స్ అఫీషియల్ గ్లింప్స్‌ ను హై-లెవల్ వీఎఫ్ఎక్స్ తో రెడీ చేస్తున్నారని, అది అదిరిపోయే అనుభూతిని ఇస్తుందని టాక్. ఇక షారుఖ్ ఖాన్ తో ప్రమోషన్ వెనుక ఓ లాజిక్ ఉంది. ఒక స్టార్ హీరో సినిమాను మరో స్టార్ హీరో ప్రమోట్ చేయడం సినీ పరిశ్రమలో సాధారణమే. కాని షారుఖ్ లాంటి హీరోతో బన్నీ చేస్తున్న ఈ వర్కౌట్ మాత్రం.. మరొక్కసారి ఇండియా వైడ్ గా బన్నీ రేంజ్ మార్మోగేలా చేస్తుంది అనడంలో నో డౌట్ అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్