Thursday, September 17, 2026 08:05 PM
Thursday, September 17, 2026 08:05 PM

భారత్ కు చమురు గుహలు.. మన వైజాగ్ ఎందుకు కీలకం..?

ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో, ముఖ్యంగా హార్మోజ్ జలసంధి వంటి కీలక ప్రాంతాల్లో ఆందోళనలు పెరిగినా సరే.. భారత్ కు అవసరమయ్యే ఇంధన భద్రతకు రక్షణ కవచంలా నిలిచే చమురు గుహలు ఉన్నాయి. వీటిని సాంకేతికంగా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అని పిలుస్తారు. యుద్ధం లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల అంతర్జాతీయంగా చమురు సరఫరా ఆగిపోతే, దేశం స్తంభించిపోకుండా ఉండేందుకు భారత ప్రభుత్వం భూగర్భంలో భారీ చమురు నిల్వలను ఏర్పాటు చేసింది. వీటినే వాడుక భాషలో “చమురు గుహలు” అని పిలుస్తారు.

Also Read : విజయ్ దళపతికి అమెజాన్ బిగ్ షాక్..!

భారత్ లో మూడు ప్రాంతాల్లో చమురు నిల్వలు ఉన్నాయి. విశాఖపట్నంలో 1.33 మిలియన్ మెట్రిక్ టన్నుల ముడి చమురును నిల్వ చేసే సామర్థ్యం ఉంది. కర్ణాటకలోని మంగళూరులో 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉంది. కర్ణాటకలోని పాదూర్ లో మరొకటి ఉంది. ఇది అతిపెద్దది, ఇక్కడ 2.5 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురును దాచవచ్చు. మొత్తంగా చూస్తే, ప్రస్తుతం మన దగ్గర సుమారు 5.33 మిలియన్ మెట్రిక్ టన్నుల ముడి చమురు నిల్వ ఉంది. ఇది దేశం మొత్తానికి సుమారు 9.5 రోజుల అవసరాలను తీర్చగలదు.

Also Read : అమరావతి పై మళ్లీ మళ్ళీ అవే కుట్రలు

ఈ నిల్వలు మనం చూసే సాధారణ ట్యాంకుల మాదిరిగా ఉండవు. వీటిని “అన్‌లైన్డ్ రాక్ కేవర్న్స్” అని పిలుస్తారు. సముద్ర తీర ప్రాంతాల్లో గట్టిగా ఉండే భారీ రాతి కొండల లోపల పెద్ద పెద్ద సొరంగాలు తవ్వుతారు. ఈ గుహలు భూమి లోపల సుమారు 10 అంతస్తుల భవనం అంత లోతులో ఉంటాయి. రాతి గోడల మధ్య ఉండే సహజమైన ఒత్తిడి వల్ల చమురు బయటకు రాకుండా, ఆవిరి కాకుండా భద్రంగా ఉంటుంది. ఇది అత్యంత సురక్షితమైన, చౌకైన పద్ధతి. ప్రస్తుత నిల్వలు సరిపోవని భావించిన ప్రభుత్వం, రెండో దశలో భాగంగా మరిన్ని చోట్ల వీటిని నిర్మిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్