Monday, August 3, 2026 12:18 PM
Monday, August 3, 2026 12:18 PM

నిద్రకు జంక్ ఫుడ్ కు లింక్ ఏంటీ..?

నిద్ర అనేది మన జీవితంలో అత్యంత ముఖ్యం. చాలా మందికి నిద్ర ప్రాధాన్యత తెలియక తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. రాత్రి సమయంలో ప్రశాంతమైన నిద్ర లేకపోవడం అనేది కేవలం మరుసటి రోజు అలసటగా అనిపించడమే కాదు, అది శరీరంలోని ప్రతి అవయంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. నిద్రలేమి వల్ల కలిగే తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రభావం అనేది ఇప్పుడు అర్ధం కాదు. దీర్ఘకాలికంగా ఆ ప్రభావం ఎక్కువ.

Also Read : మలబద్దకానికి జుట్టు రాలడానికి లింక్ ఉందా..?

మనం నిద్రపోతున్నప్పుడు రక్తపోటు సహజంగా తగ్గుతుంది. నిద్ర లేకపోతే, శరీరం ఎక్కువ సేపు అధిక రక్తపోటుతోనే ఉంటుంది. దీనివల్ల గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం 20-30% పెరుగుతుంది. నిద్రలో మెదడు తనలోని వ్యర్థాలను శుభ్రం చేసుకుంటుంది. నిద్ర లేకపోతే ఆలోచనా శక్తి తగ్గుతుంది, ఏకాగ్రత దెబ్బతింటుంది. దీర్ఘకాలంలో ఇది జ్ఞాపకశక్తి కోల్పోవడానికి దారితీస్తుంది. మనం నిద్రపోతున్నప్పుడు శరీరం ‘సైటోకిైన్స్’ అనే ప్రోటీన్లను విడుదల చేస్తుంది, ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి.

Also Read : ఏపీ మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్

నిద్ర సరిగ్గా లేకపోతే రోగనిరోధక శక్తి తగ్గి, చిన్న చిన్న వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా త్వరగా అంటుకుంటాయి. నిద్ర లేకపోతే ఆకలిని నియంత్రించే హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల జంక్ ఫుడ్ తినాలనే కోరిక పెరిగి బరువు పెరుగుతారు. అలాగే, రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. నిద్రలేమి వల్ల చిరాకు, కోపం పెరగడమే కాకుండా.. అది తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌ కు దారితీస్తుంది. మనసు ప్రశాంతంగా లేకపోతే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కోల్పోతాం. శరీరంలో గ్రోత్ హార్మోన్లు, టెస్టోస్టెరాన్ వంటివి నిద్రలోనే ఉత్పత్తి అవుతాయి. నిద్ర తగ్గితే సంతానోత్పత్తి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఉరవకొండలో పొలిటికల్ హీట్.....

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయ వాతావరణం...

ఉత్తరాంధ్ర కాదు.. ఇక...

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి...

ఇదీ ఉత్తరాంధ్ర దెబ్బ.....

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ...

మోడీని దారుణంగా మాట్లాడారు.....

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ...

భోగాపురంలో చరిత్ర సృష్టించిన...

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమవుతూ,...

అంతర్జాతీయ అద్భుతం.. మన...

విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా...

పోల్స్