Monday, August 3, 2026 12:16 PM
Monday, August 3, 2026 12:16 PM

ఎక్కడ చూసిన నీ ఫోటోలే.. తాత ఎవరే నువ్వు..?

సోషల్ మీడియా పుణ్యమా అని కొంతమంది తక్కువ సమయంలోనే సెలబ్రెటీలు అవుతారు. ఇక కొంతమంది అయితే సోషల్ మీడియా వల్లే వైరల్ అయిపోతున్నారు. కారణం ఏదైనా, సందర్భం ఏదైనా సరే.. సోషల్ మీడియా తలుచుకుంటే చాలు.. రాత్రికి రాత్రే స్టార్లు అయిపోతారు. అసలు విషయం ఏమిటో కూడా గమనించరు కొందరు. ఇప్పుడు అలాంటి ఓ విషయమే సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇంకా చెప్పాలంటే.. ఊరు పేరు లేని వ్యక్తి.. ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయాడు. చాలా మంది సోషల్ మీడియాలో ఆయనను ఇలా స్టార్‌ను చేసేశారు.

Also Read : పాండ్యా బిహేవియర్ పై విమర్శలు

ఇక అసలు విషయం ఏమిటంటే.. రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ ఫోటో తెగ వైరల్ అయ్యింది. ఆయన ఎవరో తెలియదు కానీ.. తాత అని ట్యాగ్ లైన్ పెట్టేసి.. ఆయన ఫోటోను రకరకాలుగా మార్చేస్తున్నారు నెటిజన్లు. ఒకరు జేమ్స్ బాండ్ అంటే.. మరొకరు కౌబాయ్ అంటున్నారు. చివరికి పోర్న్ స్టార్ మియా ఖలీఫా‌ను కూడా తాత పక్కన సెట్ చేసి.. సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. ఆ తాత తెలుగు వాడు అనే విషయం సగం మందికి తెలియక పోవడమే.

Also Read : ముహుర్తం ఖరారు.. మార్చి 23న శంకుస్థాపన

రెండు రోజుల క్రితం ఏ నెటిజన్ ఈ తాత ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పాత బ్లాక్ అండ్ వైట్ పాస్ పోర్టు సైజ్ ఫోటో అది. దానిపై మండల రెవన్యూ అధికారి ముద్ర కూడా ఉంది. ఈ ఫోటోను పోస్ట్ చేసిన నెటిజన్.. ఇల్లు క్లీన్ చేస్తుంటే.. మా తాత ఫోటో దొరికింది.. ఈ ఫోటోను మంచిగా ఎడిట్ చేసి ఇవ్వరా..! అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతే.. తాత ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నాయి. సోషల్ మీడియా టైమ్ లైన్‌ను తాత ఫోటో డామినేట్ చేస్తోంది. అసలు ఒరిజినల్ ఫోటోను మించి తాత ఫోటోకు గ్రాఫిక్స్ చేస్తున్నారు. మస్క్‌ పక్కన, శ్రీమంతుడు గెటప్.. ఇలా ఒకటేమిటి.. రకరకాలుగా తాత ఫోటోతో ఆడుకుంటున్నారు. కొందరైతే.. తాతను హీరోగా పెట్టి ఏఐ సినిమా తీస్తే సూపర్ ఉంటుందంటున్నారు. మొత్తానికి తాత ఎవరో తెలియదు కానీ.. ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఉరవకొండలో పొలిటికల్ హీట్.....

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయ వాతావరణం...

ఉత్తరాంధ్ర కాదు.. ఇక...

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి...

ఇదీ ఉత్తరాంధ్ర దెబ్బ.....

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ...

మోడీని దారుణంగా మాట్లాడారు.....

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ...

భోగాపురంలో చరిత్ర సృష్టించిన...

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమవుతూ,...

అంతర్జాతీయ అద్భుతం.. మన...

విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా...

పోల్స్